Fire Accident : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని నార్సింగి (Narsingi) మండలం పుప్పాలగూడలోని ఓ బిల్డింగ్ లో సడెన్ గా మంటలు చెలరేగాయి. రెండంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో సడెన్ గా మంటలు చెలరేగాయి. దాంతో దట్టమైన పొగ, మంటలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ముందు మొదటి అంతస్తులో చిక్కుకున్న ఒక పాప, ఇద్దరు మహిళలను బయటకు తీసుకొచ్చారు.
అప్పటికే పొగ బాగా కమ్మేయడంతో వారిని స్ట్రెచర్ మీద స్థానిక ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. సిజిరా(7), సహానా(40), జమీలా(70) ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సడెన్ గా మంటలు రావడంతో అవి కాస్త బిల్డింగ్ మొత్తం వ్యాపించాయని.. ఇంట్లో ఉన్న మూడు సిలిండర్లు పేలడంతో తీవ్రత పెరిగినట్టు కుటుంబీకులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురిని కాపాడగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్టు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.