క్రైమ్

Hyderabad :పంజాగుట్ట పీఎస్ లో కేసీఆర్ పై ఫిర్యాదు

  • ఫోన్​ ట్యాపింగ్​పై జరిపించాలన్న లాయర్ అరుణ్ కుమార్
  • ఫోన్ ట్యాపింగ్ లో మాజీ సీఎంను ఏ-1గా చేర్చాలి
  • అధికారం అడ్డం పెట్టుకుని రాజ్యాంగ వ్యతిరేక చర్యలు
  • అధికారులపై ఒత్తిడి తెచ్చి ట్యాపింగ్ చేశారు
  • గతంలోనూ కేసీఆర్ పై ఫిర్యాదును పట్టించుకోని పోలీసులు
  • అవినీతిపై న్యాయపోరాటం చేస్తా

Advocate Arun kumar on KCR(Today news in telangana): బీఆర్ఎస్​ హయాంలో జరిగిన ఫోన్​ ట్యాపింగ్​పై సమగ్ర విచారణ జరిపించాలని అరుణ్​కుమార్​అనే లాయర్ శనివారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ​ను కలిసి ఫోన్​ ట్యాపింగ్​కేసులో మాజీ సీఎం కేసీఆర్​ను ఏ–1గా చేర్చాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్​ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఆదేశాలతో మాత్రమే ఫోన్ ​సంభాషణలు వినే అవకాశం ఉంటుందని, అందుకు విరుద్ధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఫోన్​ ట్యాపింగ్ ​చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

న్యాయ పోరాటం చేస్తా

బీఆర్ఎస్​హయాంలో జరిగిన అవినీతిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. కేసీఆర్ ఓ మీడియా ఛానెల్ లో మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ కేసులో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నోటీసులతో కాలయాపన చేయకుండా ఫోన్ టాపింగ్ కేసు లో కేసీఆర్ ను వెంటనే అరెస్టు చేయాలని పిర్యాదు చేసారు. కేటీఆర్ యూట్యూబ్ ఛానల్స్ కి మరి కొంతమందికి లీగల్ నోటీసులు పంపించి సాక్షులను బెదిరించాలని చూస్తున్నారన్నారు. ఫోన్ టాపింగ్ కేసులో మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయారు. మిగతావారు కూడా విదేశాలకు పారిపోక ముందే వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలన్నారు. ఇకనైనా
తాను ఇచ్చిన ఫిర్యాదు పై పోలీసులు కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తానన్నారు.

 

Just In

01

DSP Bribery Case: ఏసీబీలో కలకలం రేపుతున్న డీఎస్పీ వసూళ్ల వ్యవహారం

Mahabubabad District: మహబూబాబాద్‌లో కుక్కల స్వైర విహారం.. పట్టించుకోని అధికారులు

Maoist Ashanna: మావోయిస్టు ఆశన్న సంచలన వీడియో.. ఏమన్నారంటే..?

Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Private Colleges: నవంబర్ 3 నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీల బంద్..?