Big Shock, KCR's Son Will Be Thrown In The High Court
క్రైమ్

Hyderabad: కేసీఆర్ అన్న కొడుకు అరెస్టు.. ఎందుకంటే?

  •  కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై భూ కబ్జా కేసు
  •  హైకోర్టులో దక్కని ఊరట
  •  అరెస్టు చేసిన ఆదిభట్ల పోలీసులు

Land Grabbing Case: భూ కబ్జా కేసులో మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అలియాస్ తేజేశ్వర్ రావు అరెస్టయ్యారు. ఆదిభట్ల ఓఎస్ఆర్ ప్రాజెక్టుకు సంబంధించిన భూమిలోని ఫెన్సింగ్ ధ్వంసం చేసి కబ్జా పెట్టిన ఆరోపణలపై ఆదిభట్ల పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆదిభట్ల పోలీసులు తాజాగా కన్నారావును అరెస్టు చేశారు. కాసేప్టలో రిమాండ్ చేయనున్నారు. కన్నారావుతోపాటు ఈ కబ్జాలో ప్రమేయం ఉన్నదనే ఆరోపణలతో మరో 38 మందిపై కేసు నమోదైంది.

వివాదం ఏమిటీ?

ఆదిభట్ల ఓఎస్ఆర్ ప్రాజెక్టుకు చెందిన భూమిలో కన్నారావు ఫెన్సింగ్ ధ్వంసం చేసి కబ్జా పెట్టినట్టు సదరు సంస్థ డైరెక్టర్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని 2 ఎకరాల భూవివాదానికి సంబంధించినదే ఈ కేసు. ఫెన్సింగ్ తొలగించి హద్దు రాళ్లు పెట్టారని, ఫెన్సింగ్‌ షీట్‌ను తగులబెట్టాడని ఆయన ఆరోపించారు. పోలీసులు కేసు ఫైల్ చేశారు.

కోర్టులో కన్నారావుకు చుక్కెదురు

ఈ కేసు నమోదైన తర్వాత కన్నారావు హైకోర్టును ఆశ్రయించారు. ఆదిభట్ల పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. కన్నారావు పిటిషన్‌ను కొట్టివేసింది. అరెస్టు నుంచి రక్షణ ఆయనకు లభించలేకపోయింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన రెండు సార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. తాజాగా పోలీసులు భూ కబ్జా కేసులో అరెస్టు చేశారు. కన్నారావు కోసం పోలీసులు లుకౌట్ నోటీసులూ జారీ చేశారు.

అరెస్టుపై ఆదిభట్ల సీఐ రాఘవేంద్ర రెడ్డి

కన్నారావు అరెస్టుపై ఆదిభట్ల సీఐ రాఘవేంద్ర రెడ్డి స్పందించారు. గత నెల 3వ తేదీన మన్నెగూడలో కన్నారావు, ఆయన అనుచరులు భూ కబ్జాకు ప్రయత్నించారని తెలిపారు. శ్రీనివాస్ అనే బాధితుడి ఫిర్యాదుపై కేసు ఫైల్ చేశామని చెప్పారు. ఆ భూమిలోని కాంపౌండ్ వాల్‌ను జేసీబీ సహాయంతో 26 మంది కన్నారావు అనుచరులు కూల్చివేశారని వివరించారు. అంతేకాదు, ఆ ల్యాండ్‌లో ఉన్నవారిపై దాడి చేశారని అన్నారు. జెక్కిడి సురేందర్ రెడ్డి, జెక్కిడి చంద్రారెడ్డిల వద్ద నుంచి రూ. 2 కోట్లు తీసుకుని ల్యాండ్ సెటిల్ చేస్తానని కన్నారావు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికి 9 మందిని అరెస్టు చేశామని వివరించారు. మొత్తం 26 మందిని గుర్తించామని, అందులో కొందరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపులు జరుపుతున్నామని తెలిపారు.

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం