actor hema
క్రైమ్

Rave Party: ఏం చేసుకుంటారో.. చేసుకోండి: నటి హేమ సంచలనం

Actress Hema: బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆమె విడుదల చేసిన వీడియోతో ఆమె పేరు మార్మోగిపోయింది. తాజాగా, ఆమె బ్లడ్ శాంపిల్స్ తీసుకుని డ్రగ్ టెస్టు చేయగా పాజిటివ్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అంటే బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నారని తేలింది. దీంతో సీసీబీ ఆమెకు నోటీసులు పంపనుంది. ఈ ఘటన బయటికి వచ్చినప్పటి నుంచి నటి హేమ మీడియాకు డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారు. బిగ్ టీవీ ఆమెను పలుకరించే ప్రయత్నం చేసింది.

నటి హేమను పలుకరించే ప్రయత్నం చేయగా.. ‘మీరు ఏం చేసుకుంటారో.. చేసుకోండి. సమయం వచ్చినప్పుడు మాట్లాడుతా. మీ మీడియా వాళ్లు ఏం చేస్తారో నాకు తెలుసు. నన్ను ఇరికించాలని చూస్తున్నారు. ఆ ట్రాప్‌లో నేను పడను’ అంటూ తప్పుకుపోయింది.

బెంగళూరు రేవ్ పార్టీలో తన పేరు బయటికి రాకుండా హేమ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. పేరు మార్చుకుని ఆ పార్టీకి హాజరైనట్టు సమాచారం. కృష్ణవేణి పేరుతో హేమ పార్టీకి వెళ్లారని తెలిసింది. ఈ జాగ్రత్తల్లో భాగంగానే బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం బయటకు రాగానే వెంటనే ఓ వీడియో విడుదల చేశారు. తనకు ఆ పార్టీకి సంబంధం లేదని, తాను హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌజ్‌లో చిల్ అవుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ, ఆమె ఆ వీడియోను కూడా బెంగళూరులోని ఫామ్‌హౌజ్‌లోనే రికార్డు చేశారని పోలీసు వర్గాలు తెలిపాయి.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?