acb attacks umamehswwarao
క్రైమ్

Hyderabad:ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు

acb attacks against acp Umamaheswararao and relatives illegal properties:
హైదరాబాద్‌లో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ మంగళవారం సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ అశోక్ నగర్‌లోని ఇంటితో పాటు ఏకకాలంలో
ఆయన స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. నగరంలో ఆరు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న అభియోగాలపై ఏసీబీ అధికారులు దాడులు జరుపుతున్నారు. సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు పనిచేశారు.

సాహితీ ఇన్ ఫ్రా స్కామ్ ఫ్రాడ్

అప్పట్లో రూ.1800 కోట్ల సాహితీ ఇన్ ఫ్రా స్కామ్ పై 50కి పైగా కేసులు నమోదయ్యాయి. ప్రీలాంచ్ పేరుతో బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఈ సంస్థ డబ్బులు వసూలు చేసింది. వసూలు చేసిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు. భూములు కొనకున్నా ప్రీలాంచ్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడిన సాహితీ స్కామ్ దర్యాప్తునకు సీసీఎస్ ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది. సాహితీ ఇన్‌ఫ్రా కేసుల విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు పనిచేశారు. ఇబ్రహీంపట్నం రియల్ టర్ మర్డర్ కేసులో సస్పెండ్ అయిన ఉమామహేశ్వరరావు..అప్పట్లో డబుల్ మర్డర్ కేసులో డబ్బులు తీసుకున్నాడని ఉమామహేశ్వరపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనితో ఉమామహేశ్వరరావును అప్పటి సీపీ సస్పెండ్ చేశారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు