Bangladesh MPs Friend Paid RS 5 Crore To Murder Him West Bengal CID: బంగ్లాదేశ్ ఎంపీ అన్వర్ ఉల్ అజీమ్ అనర్ తొలుత చికిత్స కోసం భారత్‌కి వచ్చి కనిపించకుండా పోయారు. ఆ తరువాత దారుణమైన హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ బంగ్లాదేశ్ హోంమంత్రి అసాదుజ్జమాన్ ఖాన్ విలేకరుల సమావేశంలో ప్రకటన చేశారు. ఈ కేసుకు సంబంధించి బంగ్లాదేశ్‌లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
ఎంపీ అజీమ్ హత్యకు గురైనట్టు నిర్ధారించినప్పటికీ ఆయన మృతదేహం మాత్రం ఇప్పటివరకు లభించలేదని పోలీసులు తెలిపారు. కోల్‌కతాలోని ఆయన నివాసం ఉన్న ఇంట్లోనే పక్కా ప్రణాళికతో నిందితులు హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీస్, కేంద్రప్రభుత్వ బలగాలు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలు అన్వర్ బసచేసిన ఇంటి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు.
Also Read:శాంతించిన కిర్గిజ్ స్తాన్
ఈనెల 13న ఎంపీతో పాటు ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఇంట్లోకి వెళ్లినట్టు సీసీ ఫుటేజీలో రికార్డయింది. ఆ తర్వాత వారు ముగ్గురు వేర్వేరుగా బయటకు వెళ్లిపోయినట్లు అందులో స్పష్టంగా తెలుస్తోంది. అన్వర్ జాడ మాత్రం లభించలేదు. ముందు వెళ్లిన ఇద్దరి చేతుల్లోనూ పెద్దపెద్ద బ్యాగులు ఉన్నట్టు ఫుటేజీలను పరిశీలించిన సీఐడీ ఐజీ అఖిలేశ్ చతుర్వేది తెలిపారు. వారు తీసుకెళ్లిన బ్యాగుల్లో ఆయన మృతదేహం ఉండే ఛాన్స్ నూటిశాతం ఉండనున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఈ హత్యలో భాగస్వాములైన మరికొందరి కోసం లుక్ అవుట్ నోటీసు జారీ చేసినట్టు బంగ్లాదేశ్ హోంమంత్రి తెలిపారు.