YS Sharmila (Image Source: twitter)
ఆంధ్రప్రదేశ్

YS Sharmila: చంద్రబాబు, పవన్‌, జగన్‌పై షర్మిల ఫైర్.. తెలుగు జాతిని అవమానించారంటూ ఆగ్రహం

YS Sharmila: ఏపీలోని కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగు జాతికి నేడు చీకటి రోజంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేనతో పాటు వైసీపీ అధినేత జగన్ సైతం ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా తెలుగు జాతికి తీరని ద్రోహం చేశారని షర్మిల మండిపడ్డారు. ‘రాజకీయాలకు అతీతంగా, అత్యున్నత పదవికి తెలుగు బిడ్డ పోటీ పడితే RSS వాదికి ఓటు వేయించిన మూడు పార్టీల అధ్యక్షులు చరిత్రహీనులు. తెలుగు ప్రజల ప్రయోజనాల కన్నా స్వలాభమే ధ్యేయంగా TDP ,YCP, జనసేన చేసిన నీచ రాజకీయాలను చరిత్ర ఎన్నటికీ క్షమించదు’ అంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘తెలుగు జాతీకి ఘోర అవమానం’
‘ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో BJP – RSS అభ్యర్థికి TDP, YCP, జనసేన పార్టీలు ఓటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగు బిడ్డ, న్యాయ నిపుణులు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు వేయకపోవడం అత్యంత బాధాకరం. తెలుగు పార్టీలు తెలుగు బిడ్డకు మద్దతుగా నిలవకపోవడం అత్యంత దురదృష్టకరం. జాతీయ స్థాయిలో తెలుగు జాతికి జరిగిన ఘోర అవమానం. చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కంటే మోడీ గారితో స్వప్రయోజనమే మీకు ముఖ్యమా?’ అని షర్మిల నిలదీశారు.

‘మీరు కీలు బొమ్మలు’
పోటీలు పడి మోడీ దగ్గర మోకరిల్లాల్సిన ఖర్మ ఎందుకు పట్టిందని టీడీపీ, జనసేన, వైసీపీని షర్మిల ప్రశ్నించారు. ‘రాష్ట్రానికి బీజేపీ చేసిన మోసం మీకు కనిపించలేదా? 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి గొంతు కోసిన విధానం గుర్తుకు రాలేదా? ఢిల్లీని మించిన రాజధాని కడతామని 11 ఏళ్లుగా దగా పడ్డామని అనిపించలేదా? రాష్ట్ర జీవనాడి పోలవరంలో జీవం తీసేస్తే మీలో చలనం లేదా? విశాఖ స్టీల్ ను పబ్లిక్ గా అమ్ముతుంటే మీకు రోషం లేదా? దీనికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ గార్లు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఎలాగో కీలుబొమ్మలు. కనీసం సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రాష్ట్రం గురించి అడిగే స్వరం ఢిల్లీలో ఉండేదన్న సోయి లేకపోవడం బాధాకరం’ అంటూ ఎక్స్ లో షర్మిల పోస్ట్ పెట్టారు.

Also Read: Balendra Shah: నేపాల్ తదుపరి ప్రధానిగా బలేంద్ర షా? నిరసనకారుల మద్దతు కూడా అతడికే!

వైసీపీ మద్దతుపై సెటైర్లు
కూటమి పార్టీలకు తోడుగా పోటీపడి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసినందుకు YCP సిగ్గుపడాలని వైఎస్ షర్మిల అన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్షాల అభ్యర్థిని కాదని అధికార పక్షానికి మద్దతు ఇవ్వడం ప్రపంచంలోనే ఇదొక వింత అని ఎద్దేవా చేశారు. ‘ఇక రాష్ట్రంలో వైసీపీకి ప్రతిపక్షం, ప్రజల పక్షం అని చెప్పుకోవడానికి అర్హత లేదు. అపోజిషన్ ముసుగులో రాష్ట్రంలో జగన్ గారు కూడా BJP పక్షమే. బీజేపీకి అవసరమైనపుడు పనికొచ్చే పక్షమే. 5 ఏళ్లలో దోచుకున్నది దాచుకోవడానికి కేంద్రానికి బానిస అయ్యారు. కేసులకు భయపడి మోడీ గారికి దాసోహం అన్నారు. తనను తాను రక్షించుకునేందుకు దత్తపుత్రుడిగా అవతారం ఎత్తి తెలుగు జాతికి జగన్ గారు నేడు చేసింది తీరని ద్రోహమే’ ఎక్స్ వేదికగా షర్మిల మండిపడ్డారు.

Also Read: Heavy Rains: తెలంగాణకు బిగ్ అలెర్ట్.. తుఫాను హెచ్చరిక జారీ.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

Just In

01

Bigg Boss Telugu 9: మొదటి వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే..

Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కొత్త జోష్.. ఎందుకంటే?

Hyderabad Collector: చాకలి ఐలమ్మ వర్శిటీ పనులపై.. కలెక్టర్ హరిచందన కీలక ఆదేశం

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేది అప్పుడేనా?

Summit of Fire: ఖతార్‌లో ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు.. మరో కొత్త ఆపరేషన్