YS Sharmila on Kiran Arrest: ఇటీవల వైఎస్ జగన్ సతీమణి వైయస్ భారతి రెడ్డి లక్ష్యంగా కిరణ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారి, చివరకు అరెస్టు వరకు దారి తీసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా పార్టీ నుండి సస్పెండ్ కూడా చేస్తూ టిడిపి అధిష్టానం చర్యలు తీసుకుంది. ఇదే అంశంపై తాజాగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ఇలాంటి సైకో గాలను నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదని షర్మిల ట్వీట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
సోషల్ మీడియాలో తనను ఉద్దేశించి తప్పుగా కామెంట్స్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో వైఎస్ షర్మిల సైతం పెద్ద పోరాటమే చేశారు. ఈ సందర్భంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా షర్మిల పలుమార్లు విమర్శలు గుప్పించారు.
మహిళలనే భావన లేకుండా, ఇష్టారీతిన కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో కొందరికి అలవాటుగా మారిందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ షర్మిల తన వాదన వినిపించారు. తన గురించి అసభ్యంగా ప్రచారం చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయడంపై షర్మిల గతంలో హర్షం వ్యక్తం చేశారు.
తాజాగా తన వదిన వైయస్ భారతి రెడ్డి గురించి కిరణ్ చేసిన కామెంట్స్ పై షర్మిల స్పందించారు. షర్మిల చేసిన ట్వీట్ ఆధారంగా.. భారత్ రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని, ఇలాంటి సైకో గాలను నడిరోడ్డు మీద ఉరి తీసిన తప్పులేదంటూ కామెంట్స్ చేశారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే యూట్యూబ్ ఛానల్ పై కఠిన చర్యలు ఉండాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. సమాజం ఇలాంటి చేష్టలను హర్షించదని, ఏ పార్టీ వారైనా శిక్ష పడాలన్నారు.
వ్యక్తిత్వ అనడానికి పాల్పడే నీచపు వ్యవస్థ మన రాష్ట్రంలోనే ఉందని, ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీనే అంటూ సంచలన ఆరోపణ చేశారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని మర్యాద లేకుండా ప్రవర్తించారని, రక్త సంబంధాన్ని కూడా మరిచారన్నారు.
Also Read: MLA Mallareddy: మెగాస్టార్ ను మించిన మల్లారెడ్డి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్..
రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని, మనిషి పుట్టుకను అవమానించి రాక్షసానందం పొందారంటూ విమర్శించారు, అన్యం పుణ్యం ఎరగని తన పిల్లలను సైతం సోషల్ మీడియా వేదికగా గుంజారని, అక్రమ సంబంధాలు అంటగట్టి ఆనందం పొందారన్నారు. ఇలాంటి వాటిపై అన్ని పార్టీలు ఏకమై ముందుకు సాగాలని, అప్పుడే వీటిని నియంత్రించవచ్చని షర్మిల అభిప్రాయపడ్డారు.
భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి…
— YS Sharmila (@realyssharmila) April 11, 2025