YS Jagan: వియ్ వాంట్ హోదా.. అసెంబ్లీలో ఉన్న కొద్దిసేపు వైసీపీ నేతల నుంచి వినిపించిన మాట ఇదొక్కటే. ఓవైపు గవర్నర్ ప్రసంగం వినిపిస్తున్నా ఇదే డిమాండ్. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో ఉంటాం అంటూ తెగ హడావుడి చేసి 11 నిమిషాల తర్వాత జగన్ సహా అందరూ వెళ్లిపోయారు. దీంతో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జగన్ అసెంబ్లీకి రావడం వెనుక అనర్హత వేటు టెన్షన్ ఉందని, అందుకే వచ్చారని అంటున్నారు. హోదా అనేది పైకి కనిపిస్తున్న డ్రామా అని తెర వెనుక అనర్హత నుంచి తప్పించుకునే ప్లాన్ ఉందనే అంశంపై రాష్ట్రమంతా జోరుగా చర్చించుకుంటున్నారు. అయితే, ఉన్న కొద్దిసేపు కౌంట్ అవుతుందా లేదా అనే దానిపైనా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
అసెంబ్లీ నుంచి వాకౌట్
గవర్నర్ ప్రసంగం మొదలైన వెంటనే అసెంబ్లీలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించాలన్నారు. ప్రజల గొంతుక వినిపించాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అంటూ నిరసన చేపట్టారు. చివరకు గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. 11 నిమిషాల పాటు అసెంబ్లీలో నినాదాలు చేసి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ సభ్యులు వెళ్లిపోయారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ముఖ్యమని, అందుకే గవర్నర్ ప్రసంగం సమయంలో డిమాండ్ చేశామనేది ఆ పార్టీ నేతల వాదన. ప్రతి పక్షం అంటే ప్రజల పక్షం అని, తమ పార్టీనీ ఆ హోదా ఇవ్వాలని అంటున్నారు. తాము అసెంబ్లీకి రావాలా వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని వాదిస్తున్నారు.
వైసీపీ వాదన కరెక్టేనా?
ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలో అడుగుపెడుతామని వైసీపీ అంటున్నది. ఈ సందర్భంగా కూటమి సభ్యుల నుంచి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. వై నాట్ 175 అంటూ ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీని ప్రజలు తిరస్కరించి 11 సీట్లు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు, దాని కోసం వైసీపీ డ్రామాలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు. 151 సీట్లు ఉన్నప్పుడు జనం గురించి పట్టించుకున్నట్టయితే, ఈ పరిస్థితి వచ్చేది కాదుగా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అసలు, ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని అంటున్నారు. ఇప్పటికైనా మూర్ఖత్వాన్ని వీడి ప్రజల తీర్పుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.
జగన్ డ్రామా బెడిసికొట్టిందా?
నిజానికి జగన్ అసెంబ్లీకి రావడం వెనుక పెద్ద ప్లానే ఉందన్న చర్చ జరుగుతున్నది. ప్రతిపక్ష హోదా వంకతో అసెంబ్లీకి రావడం మానేసిన ఆయన అనర్హత వేటు పడకుండా ఉండేందుకే వచ్చారని అనుకుంటున్నారు. అయితే, వ్యూహం అమలు చేసినంత వరకు బాగానే ఉన్నా తర్వాత అడ్డం తిరిగిందని చెబుతున్నారు. కేవలం గవర్నర్ ప్రసంగానికి హాజరైనంత మాత్రాన అసెంబ్లీకి హాజరయినట్టు కాదనేది టీడీపీ శ్రేణుల వాదన. దీంతో అసెంబ్లీ రూల్స్‌పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదని, అతిగా ఆశ పడకుండా ప్రజా తీర్పును గౌరవించి అసెంబ్లీకి రావాలనే సూచనలు వినిపిస్తున్నాయి.
Read Also: Megastar Chiranjeevi: ‘మజాకా’ను అందుకే మెగాస్టార్ పక్కన పెట్టేశాడా?