YS Jagan Rentapalla
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Jagan: 18న రెంటపాళ్ళకు వైఎస్ జ‌గ‌న్.. ఎందుకంటే?

YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఈనెల 18న ప‌ల్నాడు జిల్లా స‌త్తెన‌ప‌ల్లి మండ‌లం రెంట‌పాళ్లలో పర్యటించనున్నారు. ఈ మేరకు అధినేత పర్యటనకు సంబంధించిన విషయాలను మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) వెల్లడించారు. సోమవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న రెంట‌పాళ్ల గ్రామ ఉప‌స‌ర్పంచ్ కొర్లకుంట నాగ‌మ‌ల్లేశ్వర‌రావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారని తెలిపారు. రెంటపాళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని.. శాంతిభద్రతల పేరుతో పోలీసుల ద్వారా జగన్ రాకపై ఆంక్షలు విధించేందుకు సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ స‌త్తెనప‌ల్లి మండలం రెంటపాళ్లకు జ‌గ‌న్ వెళ్తున్న నేప‌థ్యంలో పోలీసులు స్థానిక వైసీపీ నాయ‌కుల‌ను పిలిపించి చిత్రవిచిత్రమైన ఆంక్షలు విధిస్తున్నారు. జగన్ ఎలాంటి బహిరంగ స‌భ‌లు, ర్యాలీలు, నిర‌స‌న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెంటపాళ్ళకు వెళ్ళడం లేదు. చ‌నిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించ‌డానికి వెళ్తున్నా కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేక‌పోతోంది. అస‌లు జ‌గ‌న్ ఇంటి గ‌డ‌ప దాటి బ‌య‌ట కాలు పెడితేనే చంద్రబాబు, లోకేష్‌లకు నిద్ర ప‌ట్టడం లేదు. పొగాకు రైతుల‌ను పరామ‌ర్శించ‌డానికి పొదిలి వెళితే అల‌జ‌డి సృష్టించ‌డానికి కొంత‌మంది మ‌హిళ‌ల‌ను మోహ‌రించి న‌ల్ల బెలూన్లతో నిర‌స‌నకు దిగారు. మా కార్యక‌ర్తలు, అమాయ‌క రైతుల మీద టీడీపీ గూండాల‌తో దాడులు చేయించారు. తిరిగి మా నాయ‌కుల‌పైనే అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేశారు’ అని రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also- Chiranjeevi: చిరుకు అప్పట్లోనే టీడీపీలోకి ఆహ్వానం.. ఎన్టీఆర్ మాట వినుంటే..?

Ambati Rambabu

అడ్డుకుంటే సహించం..
‘ ఇటీవ‌లే వ్యాపారి గుత్తా ల‌క్ష్మీనారాయ‌ణ‌.. పోలీసుల వేధింపులు భ‌రించ‌లేక విషం తాగి ఆస్పత్రిలో చావుబ‌తుకుల మ‌ధ్య చికిత్స పొందుతున్నారు. పోలీసుల వేధింపులు త‌ట్టుకోలేక మా నాయ‌కులు ఆత్మహ‌త్యలు చేసుకుని చ‌నిపోతుంటే వారికి భ‌రోసా ఇచ్చేందుకు జ‌గ‌న్ వెళ్తున్నారు. ఆయ‌న వెళ్లి ప‌రామ‌ర్శిస్తే పోలీసుల దుశ్చర్యలు ప్రపంచానికి తెలిసిపోతాయ‌నే భ‌యంతో జ‌గ‌న్ ప‌ర్యట‌న‌ల‌పై ఆంక్షలు విధించి అడ్డుకోవాల‌ని చూస్తున్నారు. ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ ఉంది. దాన్ని కాల‌రాసేందుకు ప్రయ‌త్నించ‌డం అప్రజాస్వామికం. చంద్రబాబు, లోకేష్ ప్రజాస్వామ్య బ‌ద్ధంగా వ్యవ‌హ‌రించాలి. జ‌గ‌న్ ప‌ర్యట‌నల‌ను అడ్డుకోవాల‌ని చూడ‌టం ప్రమాద‌క‌రమ‌ని హెచ్చరిస్తున్నాను. పొదిలిలో జ‌గ‌న్ వెంట రైతులు, మా పార్టీ కార్యక‌ర్తలు వేలాది మందితో ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు నిర‌స‌న‌కు ఎలా ప‌ర్మిష‌న్ ఇచ్చారు? జ‌గ‌న్ ప‌ర్యట‌న‌ల్లో ఏరోజూ శాంతి భ‌ద్రత‌ల స‌మ‌స్య రాలేదు. మా నాయ‌కుడి ర్యాలీ మీద కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు విసిరి ఎలాగైనా శాంతి భ‌ద్రత‌ల స‌మ‌స్య సృష్టించి ఆయన ప‌ర్యట‌న‌ల‌ను అడ్డుకోవాల‌ని చూస్తున్నారు. మిర్చి రైతులను ప‌రామ‌ర్శించ‌డానికి గుంటూరు మిర్చి యార్డుకి వెళ్లిన‌ప్పుడు, స‌త్యసాయి జిల్లా రామ‌గిరి ప‌ర్యట‌నకు వెళ్లిన‌ప్పుడు మాజీ సీఎంకు క‌నీస భ‌ద్రత కూడా క‌ల్పించ‌కుండా ఇబ్బంది పెట్టాల‌ని చూశారు. ఇంకా ఆ చర్యలన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం వెళ్తున్న ప్రతిప‌క్ష నాయ‌కుడిని అడ్డుకోవ‌డానికి భావోద్వేగాల‌ను రెచ్చగొట్టి అల‌జ‌డి సృష్టించే ప్రయ‌త్నం చేస్తున్నారు. భ‌ద్రత క‌ల్పించ‌కుండా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారం చేతుల్లో ఉంది క‌దా అని పోలీసుల‌ను ఉసిగొల్పి ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రించ‌డం ఈ ప్రఃభుత్వానికి మంచిది కాద‌ని చంద్రబాబు (Chandrababu) తెలుసుకోవాలి’ అని అంబటి రాంబాబు హితవు పలికారు.

Read Also- AP Politics: కూటమి ఏడాది పాలనపై సర్వే.. కలలో కూడా ఊహించని విషయాలు వెలుగులోకి!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు