Survey On TDP
సూపర్ ఎక్స్‌క్లూజివ్

AP Politics: కూటమి ఏడాది పాలనపై సర్వే.. కలలో కూడా ఊహించని విషయాలు వెలుగులోకి!

AP Politics: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు సర్వేలు, రాజకీయ విశ్లేషణలు పెద్ద ఎత్తునే వస్తున్నాయి. ఇందులో ఒక్కరంటే ఒక్కరూ కూటమి పార్టీల ఎమ్మెల్యేల పరిస్థితి సూపర్బ్ అని కానీ, బాగుంది అని కానీ.. కనీసం పర్లేదు అని కూడా చెప్పకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఆలోచించాల్సిన విషయమే. ఆఖరికి 2024 ఎన్నికల్లో (2024 Elections) కూటమి భారీ మెజార్టీతో గెలిచి అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వే సంస్థలు సైతం.. కూటమి పార్టీల ఎమ్మెల్యేల పరిస్థితి గురించి ఇలా చెబుతుండటంతో ఆయా నేతల అభిమానులు, కార్యకర్తలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే ‘రైజ్’ అనే సర్వే సంస్థ చేసిన సర్వేలో పలు షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ఆ సర్వేలో స్ట్రాటజిస్ట్ ప్రవీణ్ పుల్లాట ఏం చెప్పారు? రాయలసీమలో, గోదావరి జిల్లాల్లో కూటమి పార్టీల పరిస్థితి ఎలా ఉంది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘స్వేచ్ఛ’లో ఎక్స్‌క్లూజివ్‌గా తెలుసుకుందాం..


Read Also- Nara Lokesh: నారా లోకేష్‌కు ప్రమోషన్ పక్కా.. త్వరలోనే డిప్యూటీ సీఎం పదవి!

TDP And Janasena


సీమలో సీన్ రివర్స్!
రైజ్ సర్వే ప్రకారం రాయలసీమలో (Rayalaseema) అత్యధికంగా 33 మంది కూటమి ఎమ్మెల్యేలపై వ్యతిరేకత నెలకొందని తేలింది. కూటమి కొత్త ఎమ్మెల్యేలకు రానున్న 2029 ఎన్నికల్లో కష్టమేనని ప్రవీణ్ తేల్చి చెప్పేశారు. అంతేకాదు.. సీమ నుంచి ఎన్నికై మంత్రులుగా వ్యవహరిస్తున్న నలుగురు రెడ్ జోన్‌లో ఉండటం గమనార్హం. 39 మంది ఎమ్మెల్యేలపై ఎందుకింత వ్యతిరేకత ఉందనే దానికి కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. తొలిసారి ఎన్నికైన 90 శాతం కూటమి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఊహకందని రీతిలో ఉన్నాయని సర్వేలో తేలడం గమనార్హం. చిత్తూరు పార్లమెంటులో కుప్పం, పలమనేరు తప్పితే మిగిలినవి కూటమి మర్చిపోవడమే బెటర్ అని ప్రవీణ్ సింపుల్‌గా తేల్చేశారు. మరీ ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయని తేలడం ఆయన అభిమానులు, కార్యకర్తలను ఆలోచనలో పడేసే విషయం. ఇకపోతే.. టీడీపీ సీనియర్ల నియోజక వర్గాలు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పదిలంగా ఉన్నాయి. రాయలసీమ కూటమిలో వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారని.. ఇది కూడా వ్యతిరేకత రావడానికి కారణమని సర్వేలో తేటతెల్లమైంది. ఇదిలా ఉంటే.. కడప జిల్లాకు చెందిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే (వన్ టైమ్) జనసేనకు (Janasena) చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన పప్పులు ఏమీ ఉడకట్లేదని తేలింది. అయితే అక్కడ టీడీపీదే పెత్తనమంతా అని, దీంతో సదరు పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆగ్రహంతో రగిపోతున్నారట. ఇక కడప పరిస్థితికి వస్తే.. కడపలో ప్రచార ఆర్భాటం ఎక్కువ కానీ, క్షేత్రస్థాయి ఫలితాలు భిన్నంగా ఉన్నాయని తేలింది. ఇవన్నీ ఒకెత్తయితే సీమలోని ఎస్సీ నియోజకవర్గాల్లోని ప్రజలంతా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు.

Read Also- Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?

Babu And Pawan

ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పరిస్థితేంటి?
కూటమి ఏడాది పాలన సందర్భంగా ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రైజ్ సర్వేలో (Raise Survey) ఏం తేలిందనే విషయాలు ఇప్పుడు చూద్దాం. కూటమి నుంచి తొలిసారి ఎమ్మెల్యేలకు 2029లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే అవకాశం లేనే లేదు. ఎందుకంటే ఇప్పటికే కావాల్సినంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే 14 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉండటం గమనార్హం. ఎందుకంటే.. ఎమ్మెల్యేల్లో సంపాదన పిచ్చి అనేది మితిమీరిపోయిందని రైజ్ సర్వేలో తేలింది. ఎన్నికల ఖర్చులు రాబట్టుకోవాలనే యావతో టార్గెట్లు ఫిక్స్ చేసి మరీ, డబ్బులు సంపాదనలో పడ్డారని తేలిపోయింది. దర్శిలో టీడీపీ ఇన్‌ఛార్జీ బంధువుల పేరుతో దందా అంటూ ఆరోపణలు వెల్లువెత్తిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి ఉన్న సీట్లలో, ఎస్సీ స్థానాల్లో సేఫ్‌ ఫ్యాన్ పార్టీ సేఫ్‌గా ఉన్నది. ముఖ్యంగా.. మద్యం కమీషన్లు, సెటిల్మెంట్‌ పేరుతో సర్కారుకు గట్టిగానే చెడ్డపేరు వచ్చేసింది. కూటమి గెలిచిన ఎస్సీ స్థానాలు ఇకపై మరిచిపోయి, వైసీపీకి వదిలేయడమే మంచిదని స్ట్రాటజిస్ట్ ప్రవీణ్ చెబుతున్నారు. నెల్లూరు సిటీ, రూరల్‌లో కూటమికి సానుకూల వాతావరణం ఉంది. ఈ రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలను శభాష్ అని చెప్పుకోవచ్చని తేలింది. అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌పైనా వ్యతిరేకత ఉందని సర్వేలో తేలడం గమనార్హం.

Raise Survey

2029లో వీళ్లంతా ఔట్!
ఉమ్మడి కృష్ణా, గుంటూరులో కూటమికి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. అమరావతిపై వైసీపీ (YSRCP) వైఖరితో మెజారిటీ ప్రజలు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. 11 మంది కూటమి ఎమ్మెల్యేలపై నియోజకవర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అనూహ్యంగా గుడివాడలో పాత ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన కొడాలి నానికే (Kodali Nani) నియోజకవర్గ ప్రజలు జై కొడుతున్నారు. ఈ జిల్లాల ప్రస్తుత మంత్రులకు అత్యల్ప మార్కులు తమ సర్వేలో పడ్డాయని ప్రవీణ్ వెల్లడించారు. ఎస్సీ ఎమ్మెల్యేల విషయంలో టీడీపీ- వైసీపీ వైపు చెరిసగం జనాలు ఉన్నారు. వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా తిరువూరు, గుంటూరు ఈస్ట్, వెస్ట్ నుంచి పోటీచేసిన వారు మిగిలిపోనున్నారు. అయితే, గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ సింపతీ ఏమాత్రం పనిచేయలేదు. వైసీపీ నేతలతో చెలిమి, మితిమీరిన ఇసుక దందా కారణంగా ఓ ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత వచ్చిపడింది. 2029లో ఓ జనసేన ఎమ్మెల్యే అవుట్.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. టీడీపీ నుంచి మొదటిసారి ఎన్నికైన సీనియర్ ఎమ్మెల్యేలపై కూడా ఓ రేంజిలో వ్యతిరేకత వచ్చింది. ఇక గోదావరి జిల్లాల విషయానికొస్తే.. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తేలింది. అయితే ఉత్తరాంధ్రలో కూటమి పరిస్థితి ఎలా ఉందనే విషయం ఇప్పటి వరకూ ప్రవీణ్ చెప్పలేదు.. బహుశా త్వరలోనే వెల్లడిస్తారేమో.

Praveen Pullata

పట్టు కోల్పోతున్న జనసేన!
ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. ఏ జిల్లాలు అయితే 2024లో జనసేనకు పట్టం కట్టాయో.. అదే గోదారిపై జనసేన పట్టు కోల్పోతున్నది సర్వేలో నిగ్గు తేలింది. మెజారిటీ మెంబర్స్ అంతా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. టీడీపీ ఇన్‌ఛార్జ్‌లదే ఇక్కడ పెత్తనం కావడంతో ఆయా పార్టీల కార్యకర్తలు, అభిమానులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా.. ఇసుక దందా, కరెంట్ బిల్లులు, సంక్షేమ పథకాల అమలు, పంట కొనుగోలు, ఆక్వా ఇబ్బందులు, కార్యకర్తల్లో గుంభనంగా అసంతృప్తి నెలకొన్నది. దీంతో పాటు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఇక్కడ ప్రభావితం చేస్తున్న అంశాలని రైజ్ సర్వే సంస్థ ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ సర్వేపై ఎవరికి తోచినట్లుగా వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ జిల్లా చూసినా, ఏ నియోజకవర్గంలో చూసినా వైసీపీ వైపే జనాలు మొగ్గు చూపుతున్నట్లుగా సర్వేలో తేట తెల్లమైంది. అలాగనీ, ఈ సర్వేను మరీ అంత గుడ్డిగా నమ్మడానికి లేదని వైసీపీ కార్యకర్తలే చర్చించుకుంటున్న పరిస్థితి. ఇదంతా ఒక ట్రాప్ అని.. ఇదేగానీ నమ్మితే బొక్క బోర్లా పడతారని ఫ్యాన్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నేతలు చెబుతున్న పరిస్థితి. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, ద్వితియ శ్రేణి నేతలు అయితే ‘రైజ్’ సర్వే సంస్థపై కన్నెర్రజేస్తున్నారు. ఇది ఎంతవరకూ నిజమో..? కూటమి సర్కార్‌పై నిజంగానే వ్యతిరేకత ఉందా? అనే విషయాలు తెలియాలంటే.. 2029 ఎన్నికలు వచ్చేవరకూ వేచి చూడక తప్పదు మరి.

Janasena Flag

Read Also- Chiranjeevi: చిరుకు అప్పట్లోనే టీడీపీలోకి ఆహ్వానం.. ఎన్టీఆర్ మాట వినుంటే..?

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ