ఈ రెండు పథకాలే అమలు చేస్తున్నారు
కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయింది
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు
సినీ హీరోల కంటే జగన్‌కు ఎక్కువ క్రేజ్
వైసీపీ నేత కురసాల కన్నబాబు
విశాఖపట్నం, స్వేచ్ఛ: రాష్ట్రంలో ‘చంద్రన్న పగ, చంద్రన్న దగా’ అనే రెండు పథకాలను మాత్రమే అమలు చేస్తున్నారని వైసీపీ (YCP) సీనియర్ నేత కురసాల కన్నబాబు (Kurasal Kannababu) ప్రభుత్వం పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కూటమి (NDA) సర్కారు ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిందని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం చంద్రబాబు (Cm Chandrababu Naidu) మోసం చేశారని ఆయన విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా ఆదివారం కన్నబాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా… ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా తనను నియమించిన వైఎస్ జగన్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటి గడ్డ. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని జగన్ చూశారు. చెప్పింది చేసే నైజం వైఎస్ జగన్‌ది. కూటమి ప్రభుత్వం గ్రూప్-2 అభ్యర్థులను మోసం చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన నిలబడుతుంది. పేదల పక్షపాతి వైఎస్ జగన్. చంద్రబాబు లక్షా 20 వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు. కానీ, ఆ డబ్బుని ఏం చేశారో తెలియదు. రాజకీయ పార్టీలలో వలసలు సాధారణం. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే వారు కోట్లాది మంది ఉన్నారు. జగన్ సేన అన్ని సేనల కంటే స్ట్రాంగ్‌గా ఉంది. సినిమా హీరోలకు కూడా లేని క్రేజ్ వైసీపీ అధినేత జగన్‌కు ఉంది. వల్లభనేని వంశీని కలవడానికి వెళ్లినప్పుడు, పాలకొండ వెళ్లినప్పుడు జగన్‌ని చూడడానికి వచ్చిన జనప్రభంజనాన్ని చూసి కూటమి నాయకులు తట్టుకోలేకపోతున్నారు. గ్రూప్-2 అభ్యర్థులు అందరూ పరీక్షల వాయిదా కోసం చేసిన ఆందోళనను పరిష్కరించకుండా సీఎం చంద్రబాబు అందరినీ మోసం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందినా రాష్ట్రంలో వైసీపీ చాలా బలంగా ఉంది. ఉత్తరాంధ్రను నెంబర్-1గా నిలబెట్టడానికి మనందరం కలిసి పని చేద్దాం. మీ అందరితో నేను తోడుంటాను. జగనన్న బలమైన శక్తిని ఎదుర్కోవడానికి చంద్రబాబు ఎల్లో మీడియాని వాడుతున్నారు’’ అని కన్నబాబు అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్, ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు అని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు మాదిరిగా వంచనకు పాల్పడడం జగన్‌కు తెలియదని వ్యాఖ్యానించారు.
వైసీపీ ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా కన్నబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించగా, ఈ కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, ధర్మాన కృష్ణ దాస్, ఎంపీ తనూజ రాణి, వరుదు కళ్యాణి, ధర్మశ్రీ, కేకే రాజు, పండుల రవీంద్ర బాబు సహా వైసీపీ నాయకులు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read:
Janasena Nagababu: నాగబాబుకు మంత్రి పదవి ఉన్నట్టా? లేనట్టా?
Bride Came for Group-2 Exam: తలపై జీలకర్ర, బెల్లంతో గ్రూపు 2 పరీక్షకు పెళ్లికూతురు