Pakistani Women In AP: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ఘటనతో యావత్ దేశం పాకిస్థాన్ పై ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సంగతి తెలిసిందే. ముష్కరుల దాడి వెనక పాక్ ప్రభుత్వ పెద్దల హస్తముందని ప్రతీ ఒక్కరూ నమ్ముతున్నారు. దీంతో ద్వైపాక్షిక యుద్ధానికి తెర లేపిన భారత ప్రభుత్వం (Indian Govt).. పాక్ పౌరులు ఎవరూ దేశంలో ఉండటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. వారు పాక్ కు వెళ్లిపోయేందుకు డెడ్ లైన్ సైతం విధించింది. ఈ క్రమంలో దేశంలోని పలు ప్రాంతాల్లో తలదాచుకొని జీవిస్తున్న పాక్ పౌరులను (Pak Citizenes) గుర్తించి అధికారులు వారి దేశానికి పంపించేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో గత 19ఏళ్లుగా పాక్ పౌరసత్వంతో జీవిస్తున్న ఓ యువతి విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే..
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో పాకిస్థాన్ పౌరసత్వం కలిగిన ఓ యువతి గుట్టు చప్పుడు కాకుండా జీవిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఏడేళ్ల వయసులో పట్టణానికి వచ్చిన ఆమెకు ప్రస్తుతం 26 ఏళ్లు. భారత్ కు వచ్చి ఇన్నేళ్లు అయినా ఇప్పటికీ పాకిస్తాన్ పౌరసత్వం మీదనే దేశంలో ఉంటోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ పౌరులను తిరిగి పంపాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఆమె వివరాలు బయటకు వచ్చాయి.
ఆమె ఎలా వచ్చిందంటే?
కర్ణాటకలోని బళ్లారికి చెందిన మహబూబ్ పీరన్.. దేశ విభజన సందర్భంగా పాక్ కు వెళ్లిపోయారు. ఆయనకు ధర్మవరంలో ఓ చెల్లెలు ఉంది. అయితే పాక్ వెళ్లిన పీరన్ తన చిన్న కుమార్తె జీనత్ కు 1989లో సోదరి కొడుకును ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో ఆమె ధర్మవరంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడికి భార పౌరసత్వం వచ్చింది. రెండోసారి గర్భం దాల్చిన సమయంలో ఆమె తండ్రి మహబూబ్ పీరన్ కు ఆరోగ్యం బాగోలేదు. దీంతో జీనత్ తండ్రిని చూసేందుకు పాక్ వెళ్లింది. అప్పుడే కార్గిల్ యుద్ధం రావడంతో అక్కడే కొద్దికాలం పాటు ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో రంశా రఫిక్ (Ramsa Rafik) అనే ఆడబిడ్డ పుట్టగా ఆమెకు సహజంగానే పాక్ పౌరసత్వం లభించింది.
Also Read: CM Revanth On KCR: కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశారుగా!
2005లో భారత్ కు రిటర్న్
కార్గిల్ యుద్ధం అనంతర పరిస్థితులు సద్దుమణిగాక 2005లో జీనత్ తన బిడ్డ రంశా రఫిక్ తో కలిసి భారత దేశానికి వచ్చింది. తన భర్త ఉంటున్న ధర్మవరానికి వచ్చేసింది. ఇక అప్పటి నుంచి కూతురు రంశా కూడా పాక్ పౌరసత్వంపై భారత్ లో ఉంటూ వస్తుంది. 2018లో ఆమె పాక్ పౌరసత్వాన్ని పునరుద్దించుకోగా.. 2028 వరకు అది మనుగడలో ఉంది. అయితే 2023లో భారత పౌరసత్వం కోసం రంశా ప్రయత్నించినప్పటికీ అది తిరస్కరణకు గురైంది. దీంతో ప్రస్తుతం పాక్ పౌసరత్వంపై ఉంటున్న రంశా రఫిక్ పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తికరంగా మారింది.