CM Revanth On KCR: కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్
CM Revanth On KCR (imagecredit:twitter)
Telangana News

CM Revanth On KCR: కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ ఫస్ట్ రియాక్షన్.. గట్టిగా ఇచ్చిపడేశారుగా!

CM Revanth On KCR: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా తెలంగాణ – చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ (Operation Kagar) చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై చర్చించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Jana Reddy)తో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)భేటి అయ్యారు. మావోయిస్టుల శాంతి చర్చల గురించి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. ఈ సందర్భంగా రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన ప్రసంగం కూడా ప్రస్తావనకు వచ్చింది. కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా స్పందించారు.

ఆ అనార్థాలకు కేసీఆరే కారణం
కాంగ్రెస్ పాలనలోని ప్రస్తుతం తెలంగాణను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందంటూ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తాను సీఎం అయిన రెండో రోజే  కేసీఆర్ గుండె పగిలిందంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆరే కారమని ఆరోపించారు. ఖజానా అంతా లూటీ చేసింది ఆయన కాదా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ స్పీచ్ అంత అక్కసు తో మాట్లాడినట్టు ఉందని అన్నారు. కేసీఆర్ సభకు ఎన్ని అంటే అన్ని బస్సులు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

కేసీఆర్ స్పీచ్ లో పస లేదు
బస్సులు ఆపితే సభ ఆగిపోతుందని అనుకునేంత ఆలోచన వాళ్ళదని రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ కు వాళ్ళు కనీసం బస్సులు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. కేటీఆర్ (KTR), హరీష్ రావు (Harish Rao)లను పిల్లగాళ్లు అని కేసీఆర్ అన్నారని.. అలాంటప్పుడు వాళ్లని ఎందుకు అసెంబ్లీ (Telangana Assembly)కి పంపిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. నిన్నటి కేసీఆర్ స్పీచ్ (KCR Speech)లో అసలు పస లేదని అన్నారు. ఏడాదిన్నరగా తెలంగాణలో వరుసగా పథకాలు తీసుకొచ్చామని వాటన్నింటి ప్రజలకు చేరవేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన స్కీంలు ఏ రాష్ట్రంలో అమల్లో లేవని.. గత 6 నెలలుగా వాటిపై చర్చ జరుగుతోందని రేవంత్ అన్నారు.

కగార్ పై చర్చ జరగాలి
రాహుల్ కు తనకు విభేదాలంటూ గతంలో జరిగిన ప్రచారంపైనా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. రాహుల్ తో తనకు మంచి రిలేషన్ ఉందని స్పష్టం చేశారు. దీనిని ఎవరు నమ్మినా, నమ్మకమైనా తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణ సరిహద్దుల్లో జరుగుతున్న ఆపరేషన్ కగార్ పై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరముందని రేవంత్ అన్నారు. గతంలో మావోయిస్టులతో చర్చలు జరిపిన అనుభవం ఉండటంతో జానా రెడ్డితో దీనిపై భేటి అయినట్లు స్ఫష్టం చేశారు. కగార్ పై పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నాక దానిపై ప్రభుత్వ విధానం ఏంటో ప్రకటిస్తామని అన్నారు.

Also Read: Kuppam Municipal Chairman: చంద్రబాబు ఇలాకాలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీ సూపర్ విక్టరీ

కేసీఆర్ ఏమన్నారంటే
ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఎన్నో మాటలు చెప్పిందని, నేడు నీరు కూడా అందని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. కాంగ్రెస్ కు ఏడాది పాలన ఇవ్వాలని ఇచ్చానని, తాను అందుకోసమే బయటికి రాలేదన్నారు. మాట్లాడితే బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని దీనికి ఎవరు భాద్యత వహిస్తారన్నారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఆ పథకాన్ని తాను మెచ్చుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని అలాగే సాగించామన్నారు.

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..