YS Jagan
ఆంధ్రప్రదేశ్

YS Jagan: ఏ2గా వైఎస్ జగన్.. త్వరలోనే అరెస్ట్‌?

YS Jagan: వైసీపీ కార్యకర్త సింగయ్య మరణంపై (Singhaih Death) వైసీపీ-టీడీపీ మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. అది ఫేక్ వీడియో అని వైసీపీ చెబుతుంటే.. ఇంత జరిగిన తర్వాత కూడా అలా చెప్పడానికి సిగ్గులేదా? అని టీడీపీ కార్యకర్తలు, నేతలు మండిపడుతున్న పరిస్థితి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారు కిందపడి సింగయ్య మరణించాడని ఆదివారం వీడియో బయటికొచ్చింది. ప్రస్తుతం వీడీయోపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుండగా.. మరో షాకింగ్ విషయం వెలుగుచూసింది. అదేమిటంటే.. పోలీసుల అదుపులో జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి ఉన్నారని తెలిసింది. జగన్ కారు కిందపడి సింగయ్య మృతి కేసులో అరెస్టు చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కారు నెంబర్ AP40DH 2349గా పోలీసులు గుర్తించారని ప్రచారం జరుగుతోంది. ఈ కేసులో ఏ1గా డ్రైవర్ రమణారెడ్డి, ఏ2గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏ3గా కారు యజమానిని చేర్చాలని పోలీసులు నిర్ణయించారని ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తునే చర్చ నడుస్తున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

Read Also- YSRCP: సింగయ్య నిజంగానే జగన్ కారు కిందపడి చనిపోయాడా.. వీడియోపై బోలెడన్ని డౌట్స్!

కారు ఎవరిది?
కాగా, ఈ కారు ఓనర్ వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డిదిగా పోలీసులు గుర్తించినట్లుగా తెలిసింది. వైసీపీ (YSR Congress) పేరిట కారు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా, ప్రమాదం జరిగిన రోజు 304 (ఏ) సెక్షన్‌పై కేసు నమోదు చేయగా.. తాజాగా జగన్ కారు కిందపడే సింగయ్య మృతిచెందినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఎఫ్ఐఆర్ (FIR)లో అదనంగా 304 పార్ట్-2 సెక్షన్ చేర్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే.. బీఎన్ఎస్ సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు లోతుగా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగింది? కారు మీరే నడిపారా? ప్రమాదం జరిగినపుడు సింగయ్య కారు కిందపడినట్టుగా గుర్తించారా? లేదా? ఈ విషయాన్ని జగన్‌కు చెప్పారా? లేదా? అసలు జగన్ పట్టించుకున్నారా? లేదా? ప్రమాదం జరిగినప్పుడు వాహనాన్ని ఆపకుండా అలాగే ఎందుకెళ్లిపోయారు? ఇలా ఒకట్రెండు కాదు పలు ప్రశ్నలే సంధించినట్లుగా తెలుస్తున్నది. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. అరెస్ట్ చేసినట్లు వార్తలపై కానీ.. వీడియోపై కానీ పోలీసుల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

YS Jagan

జగన్‌కో న్యాయమా?
సింగయ్య ఘటనపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ, జనసేన కార్యకర్తలు చిత్రవిచిత్రాలుగా స్పందిస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ‘పుష్ప-2’ రిలీజ్ రోజు అనుమతి లేని ర్యాలీ జరిగినపుడు, అందులో తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోతే అల్లు అర్జున్ లాంటి టాప్ హీరో‌ను అరెస్ట్ చేసిన విషయాన్ని ఇక్కడ ఉదహరిస్తున్న పరిస్థితి. వాస్తవానికి.. బన్నీ గానీ, ఆయన వాహనం గానీ డైరెక్ట్‌గా ఆ ప్రమాదానికి కారణం కానే కాదు.. అయితే పరోక్షంగా మాత్రం కారణమని తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇప్పుడు వైఎస్ జగన్ కారు కిందపడి.. జగన్ స్వయంగా ఉన్న వాహనం ముందు టైర్లు మనిషిపైకి ఎక్కడంతో చనిపోయాడని.. అనుమతిలేని ర్యాలీ చేసిన, వ్యక్తిని చంపిన జగన్‌ను అరెస్ట్ చేసే సత్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. అది ప్రమాదం ఏమాత్రం కాదని.. ఉన్మాదని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

Read Also- YSRCP: ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్.. వైసీపీలోకి దేవినేని ఉమా?

కుట్ర రాజకీయం?
సింగయ్య రోడ్డు ప్రమాదంపై టీడీపీ కుట్ర రాజకీయానికి తెర తీసిందని వైసీపీ తీవ్రం ఖండిస్తున్నది. వైఎస్‌ జగన్‌పై టీడీపీ, అనుకూల మీడియా దుష్ప్రచారానికి ఒడిగట్టాయని మండిపడుతోంది. సింగయ్య మరణాన్ని వివాదం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జగన్ వాహనం ఢీ కొనలేదని ప్రమాదం జరిగిన వెంటనే గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్‌ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈనెల 18న 1:20 గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి, గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ చీలి సింగయ్య మృతిపై మీడియా సమావేశం నిర్వహించారని.. అందుకు సంబంధించిన వివరాలను వైసీపీ వెల్లడిస్తోంది. ‘ ఏటుకూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. మాజీ సీఎం కాన్వాయ్ వెళ్తున్నప్పుడు దాని ముందున్న అడ్వాన్స్ వెహికల్ ఢీ కొట్టినట్లు ఎస్పీ చెప్పారు. AP26 CE 0001 టాటా సఫారీ తగిలినట్లు స్పష్టం చేశారు’ అని ఎస్పీ చెప్పిన మాటలను వైసీపీ గుర్తు చేస్తున్నది. అయితే, ఎస్పీ చెప్పిన నాలుగు రోజులు తర్వాత టీడీపీ కుట్రకు తెరలేపిందని.. అంతేకాకుండా జగన్ వ్యక్తిత్వ హననం చేసేలా తప్పుడు ప్రచారం మొదలుపెట్టినట్లుగా వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. సింగయ్య మృతిపై తప్పుడు ఫిర్యాదుకు కుటుంబ సభ్యులపై టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారని.. సింగయ్య కుటుంబం ఒప్పుకోకపోవడంతో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

TDP Vs YSRCP

Read Also- YS Jagan: జగన్.. రప్పా రప్పా అంటే ఇదేనా?

Just In

01

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే