Vijayasai Reddy: రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నానని, వ్యవసాయం చేసుకుంటానంటూ గతంలో ప్రకటించిన వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) యూ-టర్న్ తీసుకున్నారు. జగన్ మళ్లీ (YS Jagan) పార్టీలోకి ఆహ్వానిస్తే ఆలోచిస్తానని, త్వరలో రాజకీయాల్లోకి మళ్లీ రంగ ప్రవేశం చేస్తానని స్పష్టం చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో (AP Liquor Case) గురువారం ఆయన ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘నన్ను 2020 నుంచి నన్ను సైడ్ చేశారు. వెన్నుపోటు పొడుస్తానని అనుమానం కలిగించి.. కుట్రలు చేసి నన్ను కోటరీ మనుషులు జగన్‌కు దూరం చేశారు. నేను వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు. పార్టీ నుంచి ఎందుకు వెళ్లిపోయారు?, లిక్కర్ స్కామ్ కారణమా? అని అడిగారు. జగన్ హృదయంలో లేను కాబట్టి.. కోటరీ వేధింపులు తట్టుకోలేక పార్టీ నుంచి బయటికి వచ్చాను. మళ్లీ ఈడీ విచారణకు పిలుస్తారు. లిక్కర్ స్కామ్‌తో జగన్‌కు సంబంధం లేకపోవచ్చు అనుకుంటున్నాను. సాయిరెడ్డి వందల కోట్లు ఆస్తులు కూడబెట్టినట్లు కోటరీ మనుషులు ఆరోపణలు చేస్తున్నారు’’ అని విజయసాయి రెడ్డి అన్నారు.
Read Also- Jogipet Hospital: జోగిపేట హాస్పిటల్‌లో 12 మంది డాక్టర్లకు నోటీసులు
కూటమిని విడగొడితే జగన్‌కు అధికారం
‘‘కూటమిని విడగొట్టినపుడే జగన్‌కు అవకాశం ఉంటుంది. ఈ కోటరీ ఇలాగే కొనసాగితే జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అలా రాజకీయ వ్యూహం చేసే మనుషులు కోటరీలో లేరు. జగన్‌ను కోటరీలో ఉండే మనుషులు మిస్ గైడ్ చేస్తున్నారు. నేను ఇప్పటివరకు జగన్‌ను విమర్శించలేదు. వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెబుతున్నా నేను డబ్బుకు లొంగలేదు. ఎప్పటికీ లొంగను. జగన్ ఆ వాఖ్యలు విత్ డ్రా చేసుకోవాలి. జగన్‌కు ఓ పాలేరుగా పనిచేశాను. నన్ను జగన్ పొగబెట్టి పంపించారు. జగన్ కోసం నేను శ్రమపడి సంపాదిస్తే.. కోటరీలో మనుషులు పంది కొక్కుల్లా తిన్నారు. ఏ రాజకీయ పార్టీలో చేరతారని అని అడుగుతున్నారు. నేను ఏ పార్టీలో చేరను.. నేను నా రాజకీయ భవిష్యత్తు నేనే చెప్తాను. జగన్ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఆలోచిస్తాను’’ అని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబుది దుష్ట ప్రభుత్వమని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన దుష్టమైన పని అని, తన ఆస్తులు కాకపోయినా అసత్య ప్రచారం చేస్తూ వేధింపులు.. కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also- Belt Shops Controversy: బెల్టుషాపును అడ్డుకుంటే ఊరుకోం.. మహిళలపై మందుబాబుల గుర్రు!
మిథున్ రెడ్డికి 100 కోట్లు అరేంజ్ చేయమన్నాను
ఈడీ విచారణ వివరాలను విజయసాయి రెడ్డి వెల్లడించారు. ‘‘ఎంపీ మిథున్ రెడ్డికి రూ.100 కోట్లు అరేంజ్ చేసేందుకు రికమండ్ చేశాను. సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి కంపెనీలను అరేంజ్ చేయమన్నారు. మీరు వంద కోట్లు మిథున్ రెడ్డికి ఇచ్చారా? అని అడిగారు. మీథున్ రెడ్డికి వంద కోట్లు అరేంజ్ చేసింది వాస్తవమే. అరబిందో నుంచి నేను రికమెండ చేశాను. లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సమావేశాలు జరిపారా? అని అడిగారు. నాకు ఏ రోజు లిక్కర్ స్కామ్‌తో సమావేశాలు జరగలేదు’’ అని ఆయన చెప్పారు.

