Vallabhaneni Vamsi Health
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Vallabhaneni Vamsi: వంశీకి తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు!

Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ మోహన్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వెంటనే ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందించాలని వంశీ తరఫున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందారని, ప్రస్తుత పరిస్థితిలో వంశీకి మరోసారి అక్కడే వైద్యం చేయించాలని పిటిషన్‌లో లాయర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇవాళ న్యాయస్థానం విచారణ జరపనున్నది. అయితే.. కోర్టు ఉత్తర్వులు వచ్చేవరకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఖైదీల వార్డులో ప్రత్యేక బెడ్ ఏర్పాటు చేసి డాక్టర్లు చికిత్స అందించనున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి వల్లభనేని వంశీని పోలీసులు తీసుకొచ్చేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. కోర్టు ఉత్తర్వులను బట్టి హైదరాబాద్‌కు తరలింపా? లేదా? అనేది తెలిసే అవకాశం ఉన్నది. న్యాయస్థానం నుంచి వెలువెడే ఉత్తర్వులపై వంశీ కుటుంబీకులు, వైసీపీ కార్యకర్తల్లో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

Vamsi Health Condition

వంశీకి ఏమైంది?
కాగా, 2019 ఎన్నికల సమయంలో నకిలీ ఇళ్లపట్టాలు ఇచ్చారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో వంశీకి న్యాయస్థానం మే 29 వరకు (14 రోజులు) రిమాండ్‌‌ విధించింది. ఈ క్రమంలోనే తన ఆరోగ్య సమస్యలను న్యాయాధికారి శ్రావణి విన్నారు. ‘ నాకు వంశీ విపరీతమైన దగ్గు, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఇదివరకే తనకు ప్రభుత్వ ఆస్పత్రిలో కాకుండా 48 గంటలకోసారి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యపరీక్షలు చేయించుకునే అవకాశం కల్పించాలి’ అని జడ్జిని వంశీ కోరారు. దీంతో అవసరాన్ని బట్టి వైద్య సహాయం అందించాలని రిమాండ్‌ నివేదికలో న్యాయాధికారి స్పష్టం చేశారు. మరోవైపు వంశీ సతీమణి పంకజశ్రీ సైతం.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనగా చెందుతున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, విపరీతంగా దగ్గు వస్తోందని.. బరువు తగ్గిపోయారని కంటతడి పెట్టారు. యూరిన్ శాంపిల్స్‌లో కీటోన్ శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చాయని.. వంశీ ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనగా ఉందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వంశీ తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో మరోసారి న్యాయస్థానాన్ని లాయర్లు ఆశ్రయించారు.

Read Also- Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. రాజకీయాలకు గుడ్ బై?

Vallabhaneni Vamsi Wife
రెండ్రోజుల వ్యవధిలోనే..

వల్లభనేని వంశీ మోహన్‌కు రెండు కీలక కేసుల్లో బిగ్ రిలీఫ్ దక్కింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో శుక్రవారం నాడు వంశీకి బెయిల్ వచ్చింది. ఈ కేసులో ఏ71గా ఉన్న వంశీకి శుక్రవారం సాయంత్రం సీఐడీ కోర్టు బెయిల్ ఇచ్చింది. కాగా, రెండు రోజుల వ్యవధిలోనే రెండు కీలక కేసుల్లో మాజీ ఎమ్మెల్యేకు బెయిల్ దక్కడంతో భారీ ఊరటే అని చెప్పుకోవచ్చు. రెండు రోజుల క్రితం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ మంజూరవ్వగా.. శుక్రవారం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులోనూ బెయిల్ దక్కింది. అయితే రెండు కేసుల్లో రిలీఫ్ దక్కినా వంశీ మాత్రం జైలుకే పరిమితం అయ్యారు. ఎందుకంటే.. నూజివీడు కోర్టు ఇచ్చిన రిమాండ్ కారణంగా జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు.. శుక్రవారం నాడే వంశీపై గన్నవరం పోలీసు స్టేషన్‌లో మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే.

 

Read Also- Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి బెయిల్.. ఇప్పుడైనా బయటికొస్తారా?

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?