Arjitha Seva Tickets (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి.. లేదంటే!

Arjitha Seva Tickets: దేశంలోని అత్యంత ప్రముఖ దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) ఒకటి. శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో సౌకర్యార్థం ఆన్ లైన్ లో పలు ఆర్జిత సేవా టికెట్లను ప్రవేశపెట్టింది. 3 నెలల ముందుగానే వాటిని ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే జులైకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల షెడ్యూల్ (Arjitha Seva Tickets Schedule) ను టీటీడీ (TTD) విడుదల చేసింది.

అర్జితా సేవా టికెట్లు
2025 జూలై నెలకి సంబంధించిన శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు ఏప్రిల్ 19 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులోకి రానున్నాయి. ఆ రోజు ఉదయం 10:00 గంటల నుండి 21వ తేదీ ఉదయం 10:00 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.

కల్యాణం టికెట్లు
జూలై 2025 కి సంబంధించిన కల్యాణం, ఊంజల్ సేవ, అర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వంటి సేవలకు శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల కోటా బుకింగ్.. ఏప్రిల్ 22 ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. అలాగే జులై నెలకు గాను అంగప్రదక్షిణం టోకెన్లు బుకింగ్ ఏప్రిల్ 23 ఉదయం 10:00 గంటల నుండి మెుదలు కానుంది.

రూ.300 టికెట్లు
జులై నెలకు గాను సీనియర్ సిటిజన్లు / శారీరకంగా వికలాంగుల కోటా బుకింగ్ స్లాట్ ను ఏప్రిల్ 23 మధ్యాహ్నం 3:00 గంటలకు ఓపెన్ చేయనున్నారు. అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శనం (రూ.300) టిక్కెట్ల బుకింగ్.. ఏప్రిల్ 24న ఉదయం 10:00 గంటల నుండి అందుబాటులో ఉండనుంది. వసతి కోటా బుకింగ్ కోసం ఏప్రిల్ 24 మధ్యాహ్నం 3:00 గంటల నుండి బుక్ చేసుకోవచ్చు.

Also Read: Ananthapur District: స్కూల్లో అమానుష ఘటన.. మార్నింగ్ తాళం తీసి చూడగా అంతా షాక్!

అమ్మవారి దర్శన టికెట్లు
అలాగే మే నెలకు సంబంధించి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం (Tiruchanur Sri Padmavati Ammavaari Temple).. ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 200/-) టిక్కెట్లు బుకింగ్ ఏప్రిల్ 24న మెుదలు కానుంది. ఆ రోజు, ఉదయం 10:00 గంటల నుండి ఆన్ లైన్ లో దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా మే-2025 సంబంధించి టిటిడి – స్థానిక దేవాలయాల సేవా కోటా బుకింగ్ కోసం ఏప్రిల్ 25న ఉదయం 10.00 గంటల నుండి ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉంటాయి.

దివ్యానుగ్రహ హోమం
మే-2025 కి సప్త గోవు ప్రదక్షిణ శాల, అలిపిరి వద్ద శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టిక్కెట్లను ఏప్రిల్ 25న ఉదయం 10.00 గంటల నుండి బుకింగ్ చేసుకోవచ్చు.

Just In

01

IAS Shailaja Ramaiyer: కమిషనర్ శైలజా రామయ్యర్ కు కీలక బాధ్యతలు..?

Mahabubabad District: యూరియా టోకెన్ల కోసం కిక్కిరిసి పోయిన రైతులు.. ఎక్కడంటే..?

Gold Rate Today: తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gadwal District: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం.. నది ప్రవాహంలో బాలుడు గల్లంతు

Bigg Boss 9 Telugu Promo: డబుల్ హౌస్ తో.. డబుల్ జోష్ తో.. ప్రోమో అదిరింది గురూ!