Alluri District: ఇద్దరు యువకులు గల్లంతు.. అల్లూరి జిల్లాలో విషాదం.. ఎలా జరిగిందంటే?
Alluri District ( Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Alluri District: ఇద్దరు యువకులు గల్లంతు.. అల్లూరి జిల్లాలో విషాదం.. ఎలా జరిగిందంటే?

Alluri District: సాధారణంగా సెలవులు రాగానే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. కొందరైతే విహార యాత్రలకు ప్లాన్ చేసుకుని వెళ్తారు. వెళ్లిన ప్రదేశంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కూడా ఊహించలేరు. అలాగే, ఎలా వెళ్ళామో ? అలా తిరిగి వస్తామని గ్యారెంటీ కూడా లేదు. కానీ, ఎంజాయ్ మాత్రం చేయాలనీ ట్రిప్స్ వేస్తుంటారు. అయితే, ఎక్కువగా జలపాతాలు చూడటానికి వెళ్తుంటారు. సమయంలో జరగరాని ప్రమాదాలు ఏమైనా జరిగితే మనిషే లేకుండా పోతారు. తాజాగా అనంతగిరి మండలంలో అలాంటి విషాదమే చోటు చేసుకుంది. అసలు, ఘటన ఎలా జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: Pastor Praveen’s death: పాస్టర్ ప్రవీణ్ కేసులో కొత్త షాకింగ్ నిజాలు.. క్లియర్ కట్ గా చెప్పేశారుగా!

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని పంచాయతీ పరిధిలో సరియా జలపాతం వద్ద ఇద్దరు గల్లంతు అవ్వడంతో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటన  అందర్ని కంట తడి  పెట్టిస్తుంది. అనంతగిరి మండలంలో విషాదం చోటు చేసుకుంది. జలపాతాన్ని చూద్దామని వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతు అయ్యారు. మొత్తం ఆరుగురు విహారయాత్రకు వెళ్లారు. గల్లంతైన వారిలో ఇద్దరు విశాఖపట్నం పూర్ణ మార్కెట్ ప్రాంతానికి చెందిన నరసింహం, వాసుగా గుర్తించారు. జలపాతాలు చూడటానికి వెళ్ళినప్పుడు అదుపుతప్పి జలపాతంలో జారిపోవడంతో ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదవశాత్తు జలపాతంలో యువకులు కొట్టుకుపోగా, వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న అనంతగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు