Chandrababu
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Chandrababu: తిరుపతి భారతదేశానికే ఆదర్శం కావాలి!

Chandrababu: తిరుపతి భారతదేశానికే ఆదర్శం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో భాగంగా స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు. సర్క్యులర్ ఎకానమీ దిశగా వివిధ వ్యర్ధాలను మార్చాలని అధికారులకు సూచించారు. డ్వాక్రా, మెప్మా గ్రూప్‌లను కూడా ఈ సర్క్యులర్ ఎకానమీ వ్యవస్థలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు. ఈ సందర్బంగా.. కొబ్బరి వ్యర్ధాలతో ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్త తయారు చేసిన వస్తువులను పరిశీలించారు. తిరుమల తిరుపతిలో కొబ్బరి చిప్పలను కూడా కళారూపాలుగా వివిధ ఉపయోగకర వస్తువులుగా రూపోందించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేసిన బెంచిలను, ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం తిరుపతి కపిలేశ్వరస్వామి ఆలయంలో పారిశుధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను చంద్రబాబు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కాసేపు కార్మికులతో ముచ్చటించారు.

Read Also- GHMC: సహాయక చర్యల్లో కన్పించని జీహెచ్ఎంసీ.. కర్ణన్ ఫైర్

దేశానికి సంపద..
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. యువతే దేశానికి సంపద. అందులోనూ తెలుగువాళ్లే ప్రపంచవ్యాప్తంగా మేధో సంపన్నులుగా ఉన్నారు. ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు యువతలో ఉంది. స్ఫూర్తిదాయకంగా ఉండాలి. కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామిని దర్శించుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా. తూకివాకంలో సమీకృత వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని పరిశీలించాను. రాష్ట్రమంతా పరిశుభ్రంగా ఉండాలనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మూడో శనివారం నిర్వహిస్తున్నాం. విద్యార్ధులు తమ పాఠశాలలను, పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకున్నట్టే ఇల్లూ, పరిసరాలు స్వచ్ఛంగా ఉంచాలి. చెట్లు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేసుకోవాలి. ఎక్కడ చెత్త కనిపించినా దాన్ని తీసుకువెళ్లి చెత్తబుట్టలో వేయగలిగితే పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. జపాన్‌లో ఎక్కడా రోడ్లపై చెత్తవేయరు.. మనం కూడా వారిని ఈ విషయంలో అనుసరించాలి. స్వచ్ఛ సర్వేక్షన్‌లో 5 అవార్డులు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచాం. తిరుపతి, గుంటూరు, రాజమండ్రి, విశాఖకు, విజయవాడ నగరాలకు అవార్డులు వచ్చాయి. మన నగరాల స్వచ్ఛత కోసం పనిచేసిన పారిశుధ్య కార్మికులు, అధికారులను, ప్రజలను అభినందిస్తున్నాను. స్వచ్ఛమైన పరిసరాల కోసం పాటు పడే పారిశుద్ధ్య కార్మికులే నిజమైన సమాజ సేవకులు అని చంద్రబాబు కొనియాడారు.

Read Also- Viral Videos: వామ్మో.. ఏఐతో ఇలాంటి వీడియోలు కూడా చేయొచ్చా.. పొట్ట పగిలిపోతోంది భయ్యా!

భూతాన్ని తరిమేద్దాం..
ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేయాలి. పళ్లు తోముకునే బ్రష్ నుంచి తినేప్లేట్లు, టీకప్పులు, కవర్లు చాలా ప్రమాదకరం. వాతావరణం కలుషితమై మనకు క్యాన్సర్లు రావటానికి కారణం ఈ ప్లాస్టిక్ మాత్రమే. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ త్వరగా భూమిలో కలవకుండా కలుషితం అవుతుంది. మొక్కలు, ఆహారం అంతా విషంగా తయారవుతోంది. ప్లాస్టిక్‌ను కాలిస్తే విషవాయువులు వెలువడి శ్వాస సంబంధమైన వ్యాధులు వస్తున్నాయి. ప్లాస్టిక్ వద్దు అనే నినాదాన్ని రాష్ట్రమంతా చేయాలి. 120 మైక్రాన్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్, కప్పులు, ప్లేట్లు అన్నిటినీ నిషేధిద్దాం. ప్లాస్టిక్ రహితంగా తయారైన బ్యాగులు, ఇతర ఉతర ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ఆగస్టు 15కు రాష్ట్ర సచివాలయంలో అసలు ప్లాస్టిక్ లేకుండా చేస్తాం. అక్టోబరు 2 తేదీనాటికి 17 కార్పోరేషన్లలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధిస్తాం. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దీన్ని దశలవారీగా విస్తరించి ప్లాస్టిక్ వినియోగాన్ని క్రమంగా తగ్గించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వంతో పాటు ప్రజలు ఈ మహాయజ్ఞంలో భాగం కావాలి. తిరుపతి లాంటి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రం పరిశుభ్రంగా ఉంచాలి. స్వర్ణాంధ్ర సాధ్యం కావాలంటే స్వచ్ఛాంధ్రను సాధించాలి. సర్క్యులర్ ఎకానమీ దిశగా మనం ప్రయత్నాలు ప్రారంభించాలి. ఇంటి నుంచే ఈ ప్రక్రియను చేపట్టేలా ప్రజలు ముందుకు రావాలి. తడిచెత్త నుంచి కంపోస్టు తయారు చేసుకుని ఇంటిలోనూ వాడుకునేందుకు అవకాశం ఉంది. తూకివాకంలో 300 ఎకరాల్లో సర్క్యులర్ ఎకానమీ కోసం ఓ పారిశ్రామిక పార్కు తయారు చేశాం అని చంద్రబాబు వెల్లడించారు.

బాధ్యత కలిగిన పౌరులుగా..
వినియోగించిన నీటిని సాగునీటి కోసం పంపిణీ చేస్తున్నాం. సింగపూర్ లాంటి దేశాల్లో నీటి పునర్వినియోగం జరుగుతోంది. వివిధ తడి వ్యర్ధాల ద్వారా బయో గ్యాస్, కంపోస్టు, పొడిచెత్తతో ప్లాస్టిక్ గ్రాన్యుల్స్ తయారు చేసేందుకు అవకాశం ఉంది. తిరుపతి భారత దేశానికే ఆదర్శం కావాలి. పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేస్తున్నారు. బాధ్యత కలిగిన పౌరులుగా
రహదారులపై చెత్తవేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రోడ్లూ మన సొంతమేనని అంతా భావించాలి. అప్పుడే అవి శుభ్రంగా ఉంటాయి. 123 మున్సిపాలిటీల నుంచి 9 వేల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలు వస్తున్నాయి. తడి చెత్త 5500 టన్నులు, పొడి చెత్త 3500 మెట్రిక్ టన్నులు వస్తోంది. గత ప్రభుత్వం 86 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను రోడ్లపై వదిలేసి వెళ్లింది. అక్టోబరు 2 తేదీనాటికి గత ప్రభుత్వం వదిలేసిన చెత్తను కూడా తొలగిస్తాం. ఇటీవల వచ్చిన 20 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కూడా డిసెంబరు నాటికి తొలగించి రోడ్లపై చెత్త లేకుండా చూస్తాం. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం వల్ల ప్రజలకు విష జర్వాలు వ్యాపిస్తాయి. మురుగునీటి ప్రాంతాల్లో దోమలను నివారించడానికి డ్రోన్ టెక్నాలజీని వాడబోతున్నాం అని చంద్రబాబు వెల్లడించారు.

Read Also- Midhun Reddy: మిథున్ రెడ్డి అరెస్ట్.. తర్వాత జాబితాలో ఉన్నది వీళ్లే!

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు