Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా లోకేష్ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్న పరిస్థితి. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియాలో అయితే చినబాబు గురించి ఒక్కటే చర్చ. ఎందుకంటే ఇటీవల జాతీయ మీడియా ఇండియా టుడేకి ఎక్స్‌క్లూజివ్‌గా ఇంటర్వ్యూ ఇచ్చిన లోకేష్ ‘హిందీ భాష’ గురించి అంతలా మాట్లాడారన్న మాట. ‘హిందీ మన జాతీయ భాష’ అంటూ లోకేష్ బాంబ్ పేల్చారు. ఎదురుగా కూర్చొన్న యాంకర్.. అయ్యో మీరు తప్పులో కాలేశారండి అని చెబుతున్నప్పటికీ అబ్బే ఆమె మాటలను అస్సలు లెక్కచేయలేదు. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో క్లిప్లింగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడిదే ప్రత్యర్థులు, విమర్శకులకు గోల్డెన్ ఛాన్స్ దొరికినట్లయ్యింది. దీంతో ఈయన విద్యాశాఖ మంత్రా?, యాంకర్ అంతలా వాదిస్తున్నా తాను చెప్పిందే కరెక్ట్ అన్నట్లుగా మాట్లాడటమేంటి? అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇంకొందరైతే విద్యాశాఖ మంత్రి అయ్యుండి కనీసం ఈ విషయం తెలియకపోతే ఎలా? ఇలాంటి వ్యక్తి మంత్రిగా, విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు? అని మండిపడుతున్నారు.
Read Also- Pawan Kalyan: చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్!
అసలేం జరిగింది?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా భాష వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. లోకేష్ ఇండియా టుడే ఇంటర్వ్యూలో ‘హిందీ మన జాతీయ భాష’ అని గర్వంగా చెప్పారు. అయితే.. యాంకర్ స్పష్టంగా ‘ హిందీ జాతీయ భాష కాదు’ అని చెప్పారు. అయినా సరే లోకేష్ అస్సలు ఒప్పుకోలేదు. ఆయన ఏ మాత్రం ఒప్పుకోకుండా అదే మాట మీద నిశ్చయంగా ఉన్నారు. వాస్తవానికి.. భారతదేశానికి జాతీయ భాష అనేది లేదు. భారతదేశానికి రాజ్యాంగబద్ధంగా ఎటువంటి జాతీయ భాష (National Language) లేదు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో 22 భాషలు ఉన్నాయి. వీటిని అధికారిక భాషలుగా గుర్తించారు. కాగా, హిందీ కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన అధికారిక భాష, అత్యధిక మంది మాట్లాడే భాష. కానీ, జాతీయ భాష కానే కాదు. ఆంగ్లం కూడా కేంద్రం అధికారిక భాషల్లో ఒకటి. ఈ విషయం సీబీఎస్ (CBSE) లో 8 లేదా 9వ తరగతి విద్యార్థులు కూడా తెలుస్తుంది. ఒక పరీక్షలో హిందీని జాతీయ భాష అనిపెట్టి రాస్తే తప్పుగా గుర్తిస్తారు. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. అలాంటి లోకేష్ చేసిన తప్పు ఏమంటారు? అనేది ఇప్పుడు అందరిలో వస్తున్న ప్రశ్న. రాజ్యాంగం గురించి కనీస జ్ఞానం లేకపోవడమే కాకుండా జర్నలిస్ట్ ‘మీరు చెప్పేది తప్పు’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కనీసం సరిచేసుకోకపోవడం గమనార్హం. ఒక విద్యార్థి తప్పు చేస్తే, టీచర్ సరిదిద్దుతారు.. కానీ, ఒక విద్యా శాఖ మంత్రిగా పనిచేసే వ్యక్తి ఈ తప్పు చేస్తే? అది కచ్చితంగా రాష్ట్ర విద్యా వ్యవస్థకే అవమానంగా భావించాలని నెటిజన్లు, విమర్శకులు కామెంట్లతో దుమారం రేపుతున్నారు.
Read Also- Kota vs Anasuya: కోట, అనసూయల మధ్య గొడవేంటి? కోటను అంతమాట అందా?
వామ్మో.. ఆ కామెంట్స్ చూస్తే..!
వాస్తవానికి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎప్పుడైతే నూతన విద్యా విధానం పిల్లలకు హిందీ రుద్దాలని చూశారో నాటి నుంచి ఈ వివాదం మెల్లిమెల్లిగా పాకుతూ వస్తోందన్నది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఇదివరకు కేవళం తమిళనాడులో మాత్రమే కనిపించే ఈ గొడవలు ఇప్పుడు.. కర్నాటక, మహరాష్ట్ర, తెలుగు రాష్ట్రాల వరకూ పాకాయి. ఈ మధ్యనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాష పెద్దమ్మ అని సంబోధించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ హిందీ భాషకి మద్దతు తెలుపుతూ..ఏకంగా జాతీయ భాష అని వ్యాఖ్యానించడం ఈ వివాదానికి మరింత చర్చకు తెరదీసింది. ఇక ఈ ఇంటర్వ్యూకు వస్తున్న కామెంట్స్ గురించి మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం. ‘ విద్యాశాఖ అమాత్య అర్జెంటుగా ట్యూషన్ పెట్టించుకోండి. తెలియకపోతే గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. అంతేకానీ జాతీయ స్థాయిలో ఆంధ్రా రాష్ట్రం పరువు మాత్రం తీయొద్దండి’ అని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు దీన్నే సువర్ణావకాశంగా మలుచుకొని.. ‘ హిందీ జాతీయ భాష అని ఇన్నాళ్లు తెలీదు నాకు. మా ఆంధ్రా విద్యాశాఖ మంత్రి స్పీచ్ వల్ల తెలిసింది. థ్యాంక్యూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఇందుకే కదా మీ అబ్బాయిని ఆంధ్రాలో కనీసం ప్రైవేట్ స్కూల్లో కూడా జాయిన్ చెయ్యించకుండా తెలంగాణలో ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు’ అని విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ డియర్ పవన్ కల్యాణ్, లోకేష్.. మీరు రాష్ట్రంలో చేయాల్సిన పనులు, అభివృధి చాలా ఉంది. మీ పొత్తు ధర్మం కోసం హిందీ భాషను దయచేసి ప్రజలు మీదకు రుద్ధకండి. ఎవరికి ఆసక్తి, అవసరం అనిపిస్తే వాళ్లు నేర్చుకుంటారు’ అని జనాలు హితవు పలుకుతున్నారు.
Read Also- Health: మంచి ఫుడ్ తిన్నా అనారోగ్యమేనా?, అయితే ఇది మీకోసమే!
నారా లోకేష్: హిందీ మన జాతీయ భాష
విలేఖరి: కాదండి.. హిందీ మన జాతీయ భాష కాదు
నారా లోకేష్: లేదు లేదు హిందీయే మన జాతీయ భాష
విద్యాశాఖ అమాత్య అర్జెంటుగా ట్యూషన్ పెట్టించుకోండి. తెలియకపోతే గూగుల్ లో సర్చ్ చేసుకోండి. అంతేకానీ నేషనల్ రేంజ్ లో ఆంధ్ర రాష్ట్ర పరువు మాత్రం తీయొద్దండి 🙏 pic.twitter.com/ZgMAB7pKzt
— Krishnaveni Paleti (@KrishnaveniYCP) July 15, 2025