TV Ramarao
ఆంధ్రప్రదేశ్

Janasena: వైసీపీ నుంచి జనసేనలో చేరిన కీలక నేత బహిష్కరణ

Janasena: అవును.. 2024 ఎన్నికల ముందు వైసీపీకి (YSR Congress) గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుకు అధిష్టానం ఊహించని ఝలక్ ఇచ్చింది. కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రామారావు పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ చర్యలు కూటమి స్పూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నందును ఆయన్ను పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తక్షణమే తప్పిస్తున్నట్లుగా జనసేన అధికారిక ప్రకటన చేసింది. తుది నిర్ణయం తీసుకునే వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన హైకమాండ్ స్పష్టం చేసింది. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలా అందర్నీ పక్కనపెడుతూ పోతే పార్టీలో మిగిలేదెవరు? నెక్స్ట్ ఎలక్షన్‌కు ఎవరూ మిగలరు..? నిజానిజాలేంటి? ఆయన ఎందుకు, ఎలాంటి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వచ్చిందనే విషయాలు తెలుసుకోకుండా.. కనీసం ఆయన్నుంచి వివరణ కూడా తీసుకోకుండా ఇలా తప్పించడం ఎంతవరకూ సబబు..? అని రామారావు అభిమానులు, కార్యకర్తలు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

Read Also- Thalliki Vandanam: పేరు మార్చినంత మాత్రాన ‘తల్లికి వందనం’ కొత్తదైపోతుందా..?

రామారావు ఏం చేశారు?
కొవ్వూరు నియోజకవర్గ కూటమిలోనూ ముసలం నెలకొన్నది. సొసైటీ పదవులు జనసేన, టీడీపీ నేతల మధ్య చిచ్చురేపాయి. జనసేనకు అన్యాయం జరిగిందంటూ ద్వితియశ్రేణి నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కారు. జనసేన ఇన్‌ఛార్జ్ టీవీ రామారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి వంతెనపై రాస్తారోకో నిర్వహించారు. సొసైటీ డైరెక్టర్ల సర్దుబాటులో అవకతవకలే కారణమని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో 14 సొసైటీలు ఉన్నాయి. అయితే జనసేన మాత్రం మూడంటే మూడు మాత్రమే కోరుకున్నది. అవి కూడా ఇవ్వకపోవడంతో ఇలా తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని కార్యకర్తలు చెబుతున్నారు. కాగా, జనసేన నేతలను సంప్రదించకుండా ఒక్కటంటే ఒక్కటి మాత్రమే ప్రకటించి అవమానపరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో భాగంగా జనసేన నేతలను సంప్రదించకుండానే స్థానిక టీడీపీ, బీజేపీ నేతలు సొంత నిర్ణయాలు తీసుకున్నారని రామారావు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. టీవీ చేసిన ఈ పనితో అసలుకే ఎసరొచ్చి పడింది. సీన్ కట్ చేస్తే ఆయన్ను ఇన్‌ఛార్జ్ పదవి నుంచి హైకమాండ్ తప్పించి పక్కనెట్టింది.

Read Also- Nayanthara: భర్తతో విడాకులు.. మరోసారి సంచలన పోస్ట్ పెట్టిన నయనతార?

ఎవరీ రామారావు?
టీవీ రామారావు తొలుత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం నుంచి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఓ కేసులో ఇరుక్కుని రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే 2014లో ఆయనకు టీడీపీ టికెట్ దక్కలేదు. అయినప్పటికీ సీనియర్ నేత జవహర్‌కు మద్దతుగా ప్రచారం చేసి టీడీపీ విజయానికి కృషి చేశారు. ఆ తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి రామారావుకు టికెట్ ఇవ్వలేదు. వరుసగా రెండు పర్యాయాలు టికెట్ దక్కకపోయేసరికి తీవ్ర అసంతృప్తితో టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. అలా 2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే, ఆ తర్వాత కొంతకాలం రాజకీయాల్లో పెద్దగా కనిపించలేదు. 2023 మార్చిలో వైసీపీకి రాజీనామా చేసి, జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి ఆయన జనసేన పార్టీ తరపున క్రియాశీలకంగా, సీనియర్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. వివిధ నిరసన కార్యక్రమాల్లో, ప్రజా సమస్యలపై పోరాటాల్లో జనసేన తరపున పాల్గొంటూ చురుగ్గా ఉన్నారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ