Seemaraja: యూట్యూబర్, టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ సీమరాజా.. సోషల్ మీడియా (Social Media) గురించి కాసింత అవగాహన ఉన్నోళ్లకు ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సీమరాజా మీడియా’ (Seema Raja Media) అనే యూట్యూబ్ ఛానెల్ పేరుతో నిత్యం ఏదో ఒక వివాదం, ఎవరో ఒకర్ని టార్గెట్ చేస్తూ.. ఇంకా చెప్పాలంటే వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, నేతలను ఇమిటేట్ చేస్తూ.. హేళనగా మాట్లాడటమే ఇతని పనని విమర్శలు, అంతకుమించి ఆరోపణలూ ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, ముఖ్యంగా వైసీపీ వాడినంటూ ఆ పార్టీపైనే విమర్శనాత్మక వీడియోలు, సెటైరికల్ కంటెంట్ చేస్తుంటాడు. అలా రోజూ సోషల్ మీడియాలో నిలుస్తుంటాడు. మరీ ముఖ్యంగా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీమరాజా ఆగడాలకు అడ్డు లేకుండానే పోయిందనే వాదనలు ఉన్నాయి. ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అదేమిటంటే ఎదురుతిరిగి దాడికి తెగబడిన సందర్భాలూ లేకపోలేదు. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నాడు.
Read Also- Traffic Challan: ఇన్ని చలాన్లు ఉన్నాయేంట్రా బాబోయ్.. బైక్ అమ్మేసినా సరిపోదే!
అసలేం జరిగింది..?
సీమరాజా తమపై బుధవారం రాత్రి దాడి చేశాడంటూ వైఎస్సార్ కడప జిల్లాకు (YSR Kadapa) చెందిన కొందరు యువకులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. కడప జిల్లా చిట్వేలి మండలం గొల్లపల్లిలో నిన్న రాత్రి రోడ్డుపై కొందరు యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా సీమరాజా, అతని స్నేహితులు కారులో అటువైపుగా వచ్చాడు. అయితే ఒకట్రెండు సార్లు హారన్ (Horn) కొట్టగా ఆ యువకులు తప్పుకోలేదు. దీంతో ‘నేను హారన్ కొట్టినా పక్కకు జరగరా?.. నేనెవరో తెలియదా.. తెలిసి చేశారా? తెలియకుండానే ఇలా జరగలేదా?’ అని కోపంతో విర్రవీగిపోయాడు. వెంటనే కారు దిగి ఆ ముగ్గురు యువకులను చితకబాదాడు. విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు వారిని పోలీస్ స్టేషన్‌కు (Police Station) లాక్కెళ్లి.. రివర్స్ కేసు పెట్టడం గమనార్హం. అదికూడా.. ముగ్గురు యువకులపై గంజాయి కేసు పెట్టాలని పోలీసులకే సీమరాజా హుకుం జారీ చేయడం గమనార్హం. ఇలా తమపై యూట్యూబర్ విర్రవీగుతున్నాడని యువకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. పోలీస్ స్టేషన్‌లో మరోసారి యువకులపై సీమరాజా దాడి చేశాడంటే ఎంత ఓవరాక్షన్, ఖాకీలంటే లెక్కలేనితనమో అర్థం చేసుకోవచ్చు.
పట్టించుకోరేం?
ఈ వివాదంపై ఇంతవరకూ సీమరాజా కానీ.. పోలీసులు కానీ స్పందించకపోవడం గమనార్హం. ప్రస్తుతం సోషల్ మీడియాలో, మీడియాలో ఈ వ్యవహారం బర్నింగ్ టాపిక్ అయ్యింది. కాగా, సీమరాజా మరికొందరు ఫుల్‌గా మద్యం సేవించి కారులో వెళ్తూ ఇలా దాడి చేశారని సదరు యువకులు చెబుతున్నారు. తమ తప్పేం లేకున్నా దాడికి దిగారని, ఇష్టానుసారం చితకబాదారని బాధితులు వాపోతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ఘర్షణ కాకుండా, రాజకీయ, పోలీసు వ్యవస్థలలోని అంతర్గత సంక్షోభాలకు సూచనగా కనిపిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్యే సీమరాజా వ్యవహారాలను వైసీపీ సీరియస్‌గా తీసుకున్నది. సీమరాజాతో పాటు కిర్రాక్ ఆర్పీపైనా మాజీ మంత్రి అంబటి రాంబాబు ‘మే’ మొదటి వారంలో పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, పోలీసులు చర్యలు తీసుకోకపోతే దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్తానని రాంబాబు చెబుతున్నారు. వైసీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తనతో పాటుగా మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి రోజాలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని రాంబాబు ఆరోపించారు. ఈ పోస్టులన్నీ వ్యక్తిగత దూషణలతో ఉన్నాయని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని రాంబాబు తెలిపారు. ఇవన్నీ ఒకెత్తయితే సీమరాజా వైసీపీ కండువా వేసుకుని మరీ ప్రేలాపనలు చేస్తున్నాడని, ఆయన చట్టం నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను, న్యాయస్థానాలను కోరారు.
Read Also- Kamal Haasan: బాలీవుడ్‌పై ఓపెన్ అయిన కమల్.. మూవీస్ చేయకపోవడంపై షాకింగ్ కామెంట్స్!