Sankranti Cockfighting: సంక్రాంతి వచ్చిందంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో సందడి ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో కోడి పందాల (Cockfighting) కోసం జనం వస్తుంటారు. ఈసారి కూడా భారీగా తరలివచ్చారు. పండుగ మూడు రోజుల్లో పందెం కోళ్ల కేరింతలు, పందెం రాయుళ్ల కేకలతో బరులు హోరెత్తాయి. రూ.3 వేల కోట్లకు పైనే చేతులు మారినట్టు సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ కోడి పందాలు కొనసాగాయి.
కృష్ణా జిల్లాలో కోడి పందెం
గన్నవరం మండలం కేసరపల్లి బరిలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం చర్చనీయాంశమైంది. (Hyderabad)హైదరాబాద్‌కు చెందిన జినెక్స్ అమర్ కోడి, కృష్ణా జిల్లాకు చెందిన జాట్టు సుబ్రమణ్యం కోడి బరిలో ఢీకొట్టాయి. ఈ ముసుగు కోడి పందెంలో జినెక్స్ అమర్ కోడి గెలిచింది. ఈ కోటి రూపాయల పందెంపైన పై పందాలు కూడా వేసినట్టు సమాచారం. ఒక్కో రౌండ్‌కు లక్షల్లో చేతులు మారాయని తెలుస్తున్నది.
తెలంగాణలోనూ నిర్వహణ
ఈసారి కోడి పందాలు తెలంగాణలోనూ జోరుగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్, (Andhra Pradesh) తెలంగాణ సరిహద్దుల్లో బరులు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి ఆనుకున్న ఉన్న ప్రాంతాలు పందాలు కొనసాగాయి. రాత్రి వేళల్లో లైట్లు ఏర్పాటు చేసుకుని మరీ నిర్వహించారు. లక్షల రూపాయలు చేతులు మారాయి. ఆసిఫాబాద్ జిల్లాలోనూ కోడి పందాలు కొనసాగాయి. బెజ్జూరు మండలం తలాయిలో పందెం రాయుళ్లు రెచ్చిపోయారు.
Also Read: CM Chandrababu: రప్పా రప్పా చేస్తారా.. బాబాయ్‌ని లేపేసి నింద వేస్తారా.. సీఎం చంద్రబాబు వైల్డ్ ఫైర్

