Journalist Arrested: అమరావతి రాజధానిపై జర్నలిస్ట్ వాడపల్లి కృష్టంరాజు (Vadapalli Krishnam raju) చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. సాక్షి ఛానెల్ లో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన డిబెట్ లో వాడపల్లి మాట్లాడుతున్న రాజధాని ప్రాంతంలో వేశ్యలు ఉన్నారని వ్యాఖ్యానించారు. దీనిపై అమరావతి రైతులు, టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొమ్మినేనికి బిగ్ షాక్ తగిలింది.
Also Read: Gold Rate ( 09-06-2025): మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్ రేట్స్..
హైదరాబాద్ లో కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasarao)ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. జర్నలిస్టు కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల ఘటనకు సంబంధించి గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఆయనపై కేసు నమోదైంది. రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు. త్వరలోనే వాడపల్లి కృష్టంరాజును కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.