Posani Krishna Murali Release: ప్రముఖ సినీ నటుడు, వైకాపా మాజీ నేత పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali) ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి గత నెల 26న పోసాని అరెస్టు అయ్యారు. ఈ కేసులో బెయిల్ కోసం సుదీర్ఘ విచారణ జరగ్గా తాజాగా కోర్టు బెయిల్ మంజూరు (Bail Grant) చేసింది. దీంతో పోసానిని గుంటూరు జైలు నుంచి పోలీసులు విడుదల చేశారు.
పోసాని విడుదల నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu) జైలు వద్దకు చేరుకున్నారు. బయటకు వచ్చిన పోసానిని ఆయన్ను పరామర్శించారు. ఈ క్రమంలో పోసాని భావోద్వేగానికి గురయ్యారు. అంబటి రాంబాబును హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు పోసాని విడుదల నేపథ్యంలో జైలు వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చారు. దాదాపు నెల రోజుల పోలీసు కస్టడీ తర్వాత విడుదలవుతున్న పోసానికి ఘన స్వాగతం తెలిపారు.
Also Read: KTR – Miss World 2025: మిస్ వరల్డ్ 2025 vs ఫార్ములా ఈ రేస్.. రెండింట్లో రాష్ట్రానికి ఏది బెటర్?
చంద్రబాబు, పవన్ లను దూషించిన కేసులో పోసానిని ఫిబ్రవరి 26న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్లలో కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో ఆయన జైల్లో ఉండాల్సి వచ్చింది. నెల రోజులుగా కోర్టులు, స్టేషన్లు అంటూ ఆయన తిరుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో తన ఆరోగ్య సమస్యల కారణాలని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడు. దీంతో శుక్రవారం (మార్చి 21) గుంటూరు కోర్టు పోసాని కృష్ణ మురళి బెయిల్ పిటీషన్ ని పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది. దీంతో శనివారం (మార్చి 22) బెయిల్ పై విడుదల అయ్యారు.