KTR - Miss World 2025
తెలంగాణ

KTR – Miss World 2025: మిస్ వరల్డ్ 2025 vs ఫార్ములా ఈ రేస్.. రెండింట్లో రాష్ట్రానికి ఏది బెటర్?

KTR – Miss World 2025: 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా జరగనున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ఈ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలో రాజకీయంగా పెను దుమారం చెలరేగుతోంది. ఆ పోటీలకు పెద్ద మెుత్తంలో నిధులను అధికార కాంగ్రెస్ ఖర్చు చేస్తోందంటూ విపక్ష బీఆర్ఎస్ (BRS) మండిపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ కీలకనేత కేటీఆర్ (KTR).. రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహించడం అవసరమా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పుడు ప్రజాధనం వృధా చేయడం ఎందుకని వరుస ట్వీట్లతో నిలదీస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులు గతంలో కేటీఆర్ అధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచస్థాయి ఫార్ములా ఈ-రేసును తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ – రేసుల కంటే అందాల పోటీల వల్ల రాష్ట్రానికి ఏంతో మేలు జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు.

అందాల పోటీలతో ఏంటీ ప్రయోజనం
అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party).. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంతో ఈ ప్రపంచస్థాయి మిస్ వరల్డ్ పోటీల (72nd Miss World – 2025) నిర్వహణ బాధ్యతను భూజానికి ఎత్తుకుంది. ఈ పోటీల సందర్భంగా వచ్చే 140 దేశాలకు చెందిన ప్రతినిధులకు మన తెలంగాణ సంస్కృతి, వారసత్వ సంపద, చేనేత రంగం, జానపద నృత్యాలు, దేవాలయాలు, వంటకాలను పరిచయం చేయనున్నారు. అంతేకాకుండా తెలంగాణ గొప్పతనాన్ని అద్దం పట్టేలా స్పెషల్ వీడియోలను సైతం వారి ముందు ప్రదర్శించాలని తెలంగాణ సర్కార్ ప్లాన్స్ వేస్తోంది. తద్వారా రాష్ట్ర పర్యాటకానికి అందర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. అందాల పోటీలు నిర్వహించడం వల్ల ప్రపంచస్థాయి మీడియా ఫోకస్ సైతం తెలంగాణపై పడి అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్రం గురించి, పోటీలు జరగబోయే విశ్వనగరం హైదరాబాద్ గురించి చర్చ జరుగుతుందని పేర్కొంటున్నారు.

ఫార్మూలా రేసుతో ఏం ఒనగురింది?
మిస్ వరల్డ్ – 2025 పోటీలను తప్పుబడుతున్న కేటీఆర్ ను కాంగ్రెస్ శ్రేణులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. గతంలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఫార్ములా ఈ – కారు రేసు వల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనాలేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ఖజానా ఏమోగానీ కేటీఆర్ జేబులు మాత్రం ఈ రేసుల వల్ల నిండాయని ఆరోపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసు పేరుతో బీఆర్ఎస్ పార్టీ (BRS Party)పెద్ద మెుత్తంలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రేసు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలగలేదని. రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా చెల్లించి కేటీఆర్ లబ్ది పొందారని ఆరోపిస్తున్నారు. సాధారణంగా విదేశీ కంపెనీలకు డబ్బు చెల్లించాలంటే సంబంధిత రాష్ట్ర క్యాబినేట్ తో పాటు.. ఆర్బీఐ (Reserve Bank Of India – RBI) అనుమతి తప్పనిసరి. అయితే ఈ చెల్లింపుల్లో అలాంటి అనుమతులు ఏవి తీసుకోకపోవడంతో కేటీఆర్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

Read Also: YS Sharmila: చంద్రబాబు, జగన్, పవన్.. ఒక్కటి కావాలి.. షర్మిల సంచలన ట్వీట్..

తెలంగాణలో 8 ఈవెంట్లు
ఇక మిస్ వరల్డ్ – 2025 పోటీల విషయానికి వస్తే అవి మే 7- 31 తేదీల మధ్య జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 140 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని సమాచారం. అలాగే 3,000 మంది అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సైతం హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణలోని 10 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ముగింపు కార్యక్రమాలు హైదరాబాద్ లోని నిర్వహించేందుకు హైటెక్స్, శిల్పారామం, గచ్చిబౌలి స్టేడియాలను పరిశీలిస్తున్నారు. మిగిలిన 8 ఈవెంట్లు రాష్ట్రంలోని యాదగిరిగుట్ట, రామప్ప, లక్నవరం, పోచంపల్లి, నాగార్జున సాగర్, వికారాబాద్ వంటి ప్రాంతాల్లో జరిపేలా సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ పోటీలను రాష్ట్ర సంస్కృతి, పర్యాటక అభివృద్ధి కొరకు ఒక సాధనంలా ఉపయోగించుకుంటామని పర్యాటక శాఖ ఇప్పటికే ప్రకటించింది.

‘స్వేచ్ఛ’ ఈ – పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/3989022/TG-Edition/Swetcha-daily-TG-epaper-22-03-2025#page/1/1 లింక్ క్లిక్ చేయండి

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!