Posani
ఆంధ్రప్రదేశ్

Posani Krishna Murali: ‘నాకు గుండె జబ్బు, పక్షవాతం ఉంది’.. కోర్టు ఎదుట పోసాని ఆవేదన

Posani Krishna Murali: వైకాపా నేత, సినీనటుడు పోసాని కృష్ణమురళి విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. ఇవాళ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో పోసానిని పోలీసులు హాజరుపరిచారు. విచారణ అనంతరం అతడికి ఈ నెల 20 వరకు కోర్టు రిమాండ్‌ విధించింది. అంతకుముందు పోసానిని పీటీ వారెంట్ పై కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడలోని భవానీపురం పోలీసు స్టేషన్ కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు.

కోర్టు ఎదుట పోసాని ఆవేదన

విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఎదుట పోసాని కృష్ణమురళి ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అక్రమ కేసులు పెట్టారని.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలయడం లేదని వ్యాఖ్యానించారు. పోలీసు వాహనంలో గంటల తరబడి కూర్చోబెడుతున్నారని కోర్టుకు తెలియజేశారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానన్న ఆయన గుండెజబ్బు, పక్షవాతం వంటి రుగ్మతలు తనకు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. పోసాని వ్యాఖ్యలను ఏమాత్రం పట్టించుకోని న్యాయస్థానం అతడికి రిమాండ్ విధించింది.

Also Read: Mahila Samriddhi Yojana: మహిళల కోసం కొత్త పథకం ప్రారంభం.. ఖాతాల్లోకి రూ.2500/-

శుక్రవారమే బెయిల్.. ఇంతలోనే

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో పోసాని కృష్ణ మురళికి కడప మెుబైల్ కోర్టు శుక్రవారమే బెయిల్ మంజూరు చేసింది. పోసానికి బెయిల్ ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయినప్పటికీ పట్టించుకొని కడప మెుబైల్ కోర్టు బెయిల్ మమంజూరు చేసింది. ఇప్పుడు విజయవాడలో నమోదైన కేసులో అతడికి కోర్టు రిమాండ్ విధించడం గమనార్హం.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్