Vijayawada Bomb Threat: ఈ రోజు ఉదయం విజయవాడలోని ఎల్ఐసి ఆఫీసుకు ఓ బెదిరింపు కాల్ రావడంతో విజయవాడ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. జనాలు ఎక్కువగా షాపింగ్ చేసే బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామంటూ పోలీసులకు బెదిరింపు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీసెంటు రోడ్డుకు చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. బ్యాంబ్ స్కాడ్, పోలీసులు కలిసి ఆ ప్రదేశాన్ని జల్లెడపడుతున్నారు. పోలీసులు ఆదేశించే వరకు ఎవరూ షాపులు తెరవకూడదని తెలిపారు.
Also Read: Actress Snigdha: నా జెండర్ అదే అంటూ నటి స్నిగ్ధ సంచలన కామెంట్స్.. అమ్మాయా? అబ్బాయా?
మొత్తం ఐదు బృందాలతో బాంబ్, డాగ్ స్క్వాడ్ లతో ముమ్మర తనిఖీలు చేశారు. చిన్న షాపులు నుంచి తోపుడు బండ్ల వరకు అన్నింటిని చెక్ చేశారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచి 11 గంటల వరకు . ఎక్కడా బాంబ్ ఆనవాళ్లు లేక పోవడంతో బెజవాడ ప్రజలు, అధికారుల ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం నుంచి యధావిధిగా బీసెంట్ రోడ్ లో వ్యాపారాలకు అనుమతించనున్నారు. కంట్రోల్ రూమ్ కి వచ్చిన ఫోన్ కాల్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉదయం 6 గంటల నుంచి బీసెంట్ రోడ్డు మొత్తం జల్లేడ పట్టాము. ఐదు డాగ్స్ కూడా బృందాలు, ఐదు బాంబు స్క్వాడ్ బృందాలు అన్ని ప్రదేశాలలో గాలింపు చర్యలు చేపట్టాం. ఎవరు ఎక్కడ నుంచి ఫోన్ చేశారనేదానిపై విచారణ జరుగుతుంది. ఇప్పటి వరకు బాంబు గాని, బాంబుకు సంబందించిన ఆనావాళ్లు గాని ఏమీ కనబడలేదు. ఇదొక ఫేక్ కాల్ గా భావిస్తున్నాము. అయినా గాని ప్రజలు ఇబ్బందులు పడకుండా యధావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తూ.. మరోవైపు మేము తనిఖీలను నిర్వహిస్తామని రిజర్వుడు డీఎస్పీ ప్రేమ కుమార్ తెలిపారు