Actress Snigdha: నా జెండర్ అదే.. షర్ట్, ప్యాంట్ వేసుకుంటా..
Actress Snigdha ( Image Source: Twitter)
ఎంటర్‌టైన్‌మెంట్

Actress Snigdha: నా జెండర్ అదే అంటూ నటి స్నిగ్ధ సంచలన కామెంట్స్.. అమ్మాయా? అబ్బాయా?

Actress Snigdha: నటి స్నిగ్ద అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. తెలుగు ఆడియెన్స్ ఈమె సుపరిచితురాలే.. ఈ పేరు తెలియకపోవచ్చు.. కానీ, ఆమె ఫేస్ చూస్తే ఈజీగా గుర్తుపడతారు. స్టార్ హీరో నాని నటించిన అలా మొదలైంది మూవీలో నాని ఫ్రెండ్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. వచ్చిన అవకాశాలను అంది పుచ్చుకుని స్టార్ హీరోస్ చిత్రాల్లో ముఖ్య పాత్రల్లో నటించి అందర్ని మెప్పించింది. అలా అలా మొదలైంది హిట్ అవ్వడంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వచ్చాయి. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది. అయితే, రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జెండర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఏం మాట్లాడిందో ఇక్కడ తెలుసుకుందాం..

Also Read:  Police Constable Recruitment: పోలీస్ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్.. 10,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేయండి!

నా జెండర్ అదే!

చూడటానికి అబ్బాయిలా ఉండే ఈ అమ్మాయి జెండర్ చాలా మందికి ఓ సందేహం ఉంది. స్నిగ్ద అమ్మాయా? అబ్బాయా? అని. అయితే, ఇదే ప్రశ్నను ఓ యాంకర్ అడగగా.. దానికి జవాబు గట్టిగానే చెప్పింది. నేను అమ్మాయినే.. అబ్బాయిని కాదు. ప్రతి నెల నాకు కూడా పీరియర్డ్స్ వస్తాయి. నేను అందరి లాగే ప్యాడ్స్ కొనుక్కుంటానని తెలిపింది.

Also Read: Kumari Aunty: మీకో దండంరా బాబు.. నన్ను వదిలేయండి.. మొత్తం మీరే చేశారంటున్న కుమారి ఆంటీ

అందుకే అబ్బాయిలా రెడీ అవుతా?

అప్పుడు యాంకర్ మరి ఎందుకు అబ్బాయి స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నావ్ అని అడగగా .. నాకు అదే మంచిగా ఉంటుంది. షర్ట్, ప్యాంట్ వేసుకుంటే ఫ్రీగా వేసుకుంటుందని ఆమె మాటల్లో చెప్పింది.

ఆ ఉద్దేశం లేనే లేదు? 

వయస్సు నలబై దాటిన ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదని యాంకర్ అడగగా.. ఆమె వెంటనే నో నేను చేసుకోను అని చెప్పింది. ఇంత వరకు ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. అలాగే, మ్యారేజ్ చేసుకుంటే వేరొకరి కంట్రోల్లో ఉండాలి.అది మన వల్ల కాదు. నాకు అలాంటి జీవితం వద్దు అని చెప్పింది. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?