Perni Nani Jump
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Perni Nani: చీకట్లో కన్నుకొట్టి కనిపించకుండా పోయిన పేర్ని నాని!

Perni Nani: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జూలై 8న పామర్రులో జరిగిన వైసీపీ కార్యక్రమంలో పేర్ని.. ‘రప్పా రప్పా అని చెప్పడం కాదు.. రాత్రికి రాత్రి చేసేయాలి’ అనే వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో నానిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి ముందస్తు బెయిల్ కోసం పేర్ని నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టులో ముందస్తు రక్షణ లభించకపోవడంతో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు.. తనను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ఆలోచనతో నాని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన విన్నపాన్ని తోసిపుచ్చిన హైకోర్టు తదుపరి విచారణను మంగళవారానికి (జూలై 22) వాయిదా వేసింది. ఈ క్రమంలో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తున్నది. మరోవైపు.. పేర్ని నాని కోసం పోలీసు బృందాలు పెద్ద ఎత్తున గాలిస్తున్నాయి. రేపటి హైకోర్టు విచారణ అనంతరం నాని అజ్ఞాతంను వీడి బయటికొచ్చే వచ్చే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. కాగా, ఇలా పోలీసు కేసు నమోదైన ప్రతిసారీ పేర్ని అజ్ఞాతంలోకి వెళ్లడం పరిపాటిగా మారింది. గతంలో గోడౌన్ వ్యవహారంలోనూ ఫ్యామిలీ.. ఫ్యామిలీ కొన్నిరోజుల పాటు కనిపించకుండా పోయింది. కోర్టుల నుంచి ఊరట లభించే సరికి అజ్ఞాతం వీడి బయటికొచ్చారు.

Read Also- Hari Hara Veera Mallu: ప్రీ రిలీజ్ వేడుక వద్ద ఉద్రిక్తత.. ఫ్యాన్స్‌పై లాఠీచార్జి!

అసలేంటీ వివాదం?
జూలై 8న పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో పేర్ని నాని పాల్గొన్నారు. ఈ మధ్య వైసీపీ నేతలను వరుస కేసుల్లో అరెస్ట్ చేస్తుండటం, రెడ్ బుక్ అంటూ హడావుడి చేస్తున్న నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన నాని.. ‘ రప్పా రప్పా అని చెప్పడం కాదు… రాత్రికి రాత్రే చేసేయాలి. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. ఏదైనా చేయాలంటే నిశ్శబ్దంగా చేయండి, అరవకండి. చీకట్లో కన్ను కొట్టి చంపేయాలి.. ఉదయమే వెళ్లి ఏమీ తెలియనట్లుగా పరామర్శించాలి’ అంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాని చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అచితూజజ ఈ వ్యాఖ్యలు రాజకీయ హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని తెలుగుదేశం(TDP) నాయకులు తీవ్రంగా ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పేర్ని నానిపై తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదులు చేయగా.. పోలీసులు కేసులు నమోదు చేసి రంగంలోకి దిగారు. ముఖ్యంగా.. విజయవాడ టూ టౌన్, అవనిగడ్డ, పామర్రు, మచిలీపట్నం ఆర్.పేట పోలీస్ స్టేషన్లలో నానిపై ఫిర్యాదులు దాఖలయ్యాయి.

Read Also- Betting Apps Case: బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం.. రానా, మంచు లక్ష్మికి పిలుపు

ఏం జరుగుతుందో?
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడారని, హింసను ప్రేరేపించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ నుంచి కాపాడాలని, రక్షణ కోసం హైకోర్టులో పేర్ని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్‌పై హైకోర్టు నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో, పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మరోవైపు ఆయన వ్యక్తిగత పనుల మీద విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లినట్లుగా అనుచరులు, అభిమానులు చెబుతున్నారు. హైకోర్టు విచారణ అనంతరం ఆయన వెలుగులోకి వస్తారని స్థానిక వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. గతంలో కూడా పేర్ని నానిపై గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో నాని భార్య పేర్ని జయసుధ కూడా ఉన్నారు. ఆమెకు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరైంది. తాజా పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. జూలై 22న హైకోర్టు ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేలుస్తున్నారు. ‘ చీకట్లో కన్ను కొట్టాలి అన్నావ్.. చివరికి అదే చీకటిలో కనపడకుండా పారిపోయావ్ పేర్ని నాని. ఈ మాత్రం దానికి ఎందుకు అంత పెద్ద పెద్ద డైలాగ్స్. దేశ రాజకీయాల్లో ఉన్న చెత్తలో సగం మీ పార్టీలోనే ఉంది జగన్ అన్న.. అందులో పేర్ని నాని ఫస్ట్ ఉంటారు’ అంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తున్నారు.

Read Also- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో పెను సంచలనం.. ‘ఈనాడు’కు కోట్లల్లో ముడుపులు!

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు