ఆంధ్రప్రదేశ్: Payyavula Keshav: తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గోన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో 16 వ ఆర్ధిక సంఘం సభ్యలతో కలసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఉదయం అభిషేకం సేవలో 16 వ ఆర్ధిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు, టీమ్ ఇండియా మాజీ డాషింగ్ ప్లేయర్ వివిఎస్ లక్ష్మణ్ దంపతులు వేర్వేరుగా స్వామి వారిని దర్శించుకొని పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమలలో శ్రీవారి అభిషేకం సేవలో పలువురు ప్రముఖులు పాల్గోన్నారు.
Also Read: Chamala Kiran Kumar: జోకర్లుగా ఆ పార్టీ నాయకులు.. ఎంపీ హాట్ కామెంట్స్!