Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు.. అణుశక్తి!

Pawan Kalyan: అణుశక్తి లాంటి విభిన్న స్వభావాలు కలిగిన నాయకుడు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఎమ్మెల్సీ నాగబాబు పేర్కొన్నారు. సోమవారం ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి చెందిన ఎన్ఆర్ఐ జన సైనికులు, వీర మహిళలతో వర్చువల్ సమావేశంలో నాగబాబు (Nagababu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘న్యూక్లియర్ అనగానే అది ఒక పేలుడు పదార్థం అనే భావన మాత్రమే సాధారణంగానే అందరిలో ఉంటుంది. న్యూక్లియర్ అంటే అణుశక్తి. అణుశక్తి వలన అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది కార్బన్-రహిత శక్తి వనరు, పర్యావరణానికి మంచిది. విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సమర్థవంతమైన మార్గం. ఇంకా ఇది వైద్య రంగంలో, పరిశ్రమలలో ఉపయుక్తమవుతోంది. అణుశక్తి ద్వారా నీటిని కూడా శుద్ధి చేయవచ్చు. అలాంటి విభిన్న స్వభావాలు కలిగిన వ్యక్తే పవన్ అని చెప్పారు. జనసేనపై అభిమానంతో పార్టీకి ఆర్థిక సహకారం అందజేస్తున్న ఎన్ఆర్ఐ జన సైనికులు, వీర మహిళలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read Also- Janasena: పుంజుకుంటున్న బీజేపీ.. మంత్రి పదవికే అంకితమైన పవన్.. జనసేనకు ఎందుకీ గతి?

Nagababu

అందరూ అదరగొట్టేస్తున్నారు!
సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని కూటమి పాలన ఏడాది కాలంలోనే ప్రజలకు చేరువైంది. పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఆర్థిక శాఖ మంత్రిగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో సఫలీకృతం అవుతున్నారు. తల్లికి వందనం పథకంలో భాగంగా 67 లక్షల మంది విద్యార్థులకు గానూ రూ.10,091 కోట్లు ఒకే రోజు అర్హుల ఖాతాల్లో జమ చేయడం అద్భుతమైన అంశం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) విద్యా సంవత్సరం ప్రారంభమైన మొదటి రోజు 80 శాతం మంది పిల్లలకు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు అందజేయటం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టడం అభినందనీయం. ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పాత్ర గణనీయమైంది. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh) వినూత్నమైన సంస్కరణలతో రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు అని నాగబాబు వెల్లడించారు.

Pawan Kalyan

అభివృద్ధి బాటలో పిఠాపురం..
పిఠాపురం (Pithapuram) అభివృద్ధి కోసం పవన్ కేవలం ఒక్క ఏడాదిలోనే రూ.308 కోట్లు ఖర్చు చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధిపై కూడా ఎక్కువ దృష్టి సారించాలనే కూటమి ప్రభుత్వం ఆలోచనల మేరకు పవన్ కళ్యాణ్ రవాణాకు ప్రధాన వనరు అయిన రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యతనిస్తున్నారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామాల్లో నీటి తొట్టెల నిర్మాణం, ఏజెన్సీవాసుల డోలీ కష్టాలు తీర్చేందుకు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారుల నిర్మించే ప్రక్రియ చేపట్టారు. సర్పంచుల వినతి మేరకు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, జాతీయ పండుగలైన స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవం వేడుకలకు ప్రతీ ఏడాది గ్రామస్థాయిలో రూ.10 వేలు, మండల స్థాయిలో రూ. 25 వేలు కేటాయించిన ఘనత పవన్‌కే దక్కుతుంది. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తోంది. అనేక సమస్యలు, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే పేదల సేవలో, పెన్షన్లు, అన్న క్యాంటిన్లు, దీపం-2, తల్లికి వందనం (Thalliki Vandanam), మత్స్యకార సేవలో లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చాం. మెగా డీఎస్సీతో దాదాపు 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తూ, ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టాం. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడినపెట్టి, రైల్వే జోన్ సాధించడం, స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించడం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమైంది అని నాగబాబు తెలిపారు.

Read Also- YS Jagan: 18న రెంటపాళ్ళకు వైఎస్ జ‌గ‌న్.. ఎందుకంటే?

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు