ఆంధ్రప్రదేశ్

AP P4 Policy: ఏపీలో పేదలకు పట్టాభిషేకం.. చకచకా ఏర్పాట్లు..

అమరావతి స్వేచ్చ బ్యూరో: AP P4 Policy: ఏపీలో పేదలకు పట్టాభిషేకం.. చకచకా ఏర్పాట్లు..  ఈనెల 30న (ఆదివారం) మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం వెనుక పీ-4 విధానాన్ని (ప్రభుత్వ, ప్రవేట్, ప్రజల, భాగస్వామ్యం) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పీ-4తో సమాజంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈకార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. .ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10 శాతం మంది అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను దత్తత తీసుకుని, వారికి అండగా నిలిచి పేదరికం నుంచి పైకి తీసుకురావాలనే ఆశయంతో పీ-4 కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఇప్పటికే ఈ పీ-4 విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి ప్రభుత్వం సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పీ-4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉగాది పర్వదినాన జరగనుంది. 30న సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి వచ్చే వారందరినీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల లోపు వేదిక వద్దకు తీసుకొచ్చేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ప్రత్యేక బస్సుల ద్వారా తీసుకెళ్లనున్నారు. సుమారు 13వేల మందిని ఈ కార్యక్రమానికి తరలించనున్నారు.

సమీప జిల్లాలైన ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 7 వేల మందిని, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కనీసం 500 మంది చొప్పున, మిగతా జిల్లాల నుంచి 300 మంది చొప్పున తరలించనున్నారు. ఇక దూర ప్రాంత జిల్లాలైన మన్యం, అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య, కర్నూల్, అనంతపురం, శ్రీ సత్యసాయ జిల్లాల నుంచి తక్కువ కాస్త తక్కువమందని తరలించనున్నారు. ఆర్టీసీ బస్సులను ఆయా జిల్లాల నుంచి అందుబాటులో ఉంచనున్నారు. బస్సుల ద్వారా సురక్షితంగా కార్యక్రమానికి తీసుకువచ్చి తిరిగి గమ్యస్థానాలకు చేర్చేందుకు వీలుగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

Also Read: Nara Lokesh: లోకేష్ కు ఒక్క మెసేజ్.. అందరూ అలర్ట్.. అంతా 15 నిమిషాల్లోనే..

ప్రజలను తరలించే ప్రక్రియను రాష్ట్ర స్థాయి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ హరినారాయణను మరో ముగ్గురు ఉన్నతాధికారులను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని, ప్రతి బస్సుకు ఒక లైజన్ అధికారిని కూడా నియమించారు. అమరావతికి సమీప జిల్లాల నుంచి తరలించే వారిని అదే రోజు ఉదయం బయలుదేరే విధంగా చూసుకొని వారికి అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజన ఏర్పాట్లు చేయనున్నారు.

దూర ప్రాంతాల జిల్లాలకు చెందిన వారు ఒక రోజు ముందే బయలుదేరాల్సి ఉంటుంది. కాబట్టి, రెండు రోజులకు తగిన వసతి కల్పించనున్నారు. సభా వేదిక వద్ద ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ శరవేగంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా, సభా ప్రాంగణంలో వాటర్ ప్రూప్ జెర్మన్ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ చదును చేసే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. సభా వేదిక వద్ద పనులు, వీఐపీలు, ఇతర వాహనాల పార్కింగ్ తదితర ప్రాంతాలను జేసీబీలతో చదును చేసే పనులను యుద్దప్రాదిపతికన చేపడుతున్నారు.

Also Read: Kolikapudi Srinivasa Rao: బెదిరిస్తున్న టిడిపి ఎమ్మెల్యే.. అసలు కారణమిదే!

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు