Lokesh On Govt Teachers
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Nara Lokesh: మా‘స్టార్స్’ బ్రాండ్ అంబాసిడర్స్.. హ్యాట్సాఫ్!

Nara Lokesh: యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఇంట్రెస్టింగ్ పోస్టు చేశారు. ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మా’స్టార్స్’
మీకు హ్యాట్సాఫ్’ అని హెడ్డింగ్‌తో ట్వీట్ ప్రారంభించారు. ‘ఈ మేస్టారులు.. మా’స్టార్స్’.. ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్.. మీకు హ్యాట్సాఫ్. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించాలని కోరే మీరు, మీ పిల్లల్ని కూడా అదే పాఠశాలల్లో చేర్పించడం ఆదర్శనీయం. ప్రభుత్వ విద్యాలయాలు, ప్రైవేటు విద్యాసంస్థల కంటే మెరుగైనవని గవర్నమెంట్ స్కూళ్లలో చదివిన మీ పిల్లలు సాధించిన ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణలు. పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు జడ్పీ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ బొంతు మధుబాబు, పంగిడిగూడెం ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు (పీఈటీ) బాబూ రాజేంద్రప్రసాద్‌, సోమరాజుచెరువు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు వీరవాసరపు బాలకరుణాకరరావులకు అభినందనలు తెలియజేస్తున్నాను అని ఎక్స్‌లో లోకేష్ పోస్టు చేశారు. ఈ ట్వీట్‌కు అభిమానులు, విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి.

Read Also- Vijay Sethupathi: కొడుకు చేసిన పనికి సారీ చెప్పిన సేతుపతి.. ఇప్పుడిదే హాట్ టాపిక్!

Nara Lokesh

ఇదీ అసలు సంగతి..
వాస్తవానికి.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పని చేసేవాళ్లు ప్రభుత్వ స్కూళ్లలోనే వాళ్ల పిల్లలను చదివించడం అనేది చాలా అరుదు. ఎందుకంటే పైసలు ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివిస్తుంటారు. కానీ రాజేంద్రప్రసాద్, మధుబాబు, బాలకరుణాకర రావులు మాత్రం అందరికీ ఆదర్శకంగా నిలబడ్డారు. జనాలు అందరికీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించమని చెప్పి, తన పిల్లలను ప్రైవేటు స్కూల్‌లో చదివించడమేంటని ప్రశ్నించుకొని.. మార్పు మన నుంచే రావాలని భావించారు. అందుకే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించారు. ఇలా వారు ఉత్తమ ఫలితాలు సాధించేలా నిత్యం కృషి చేస్తూ.. తమ పిల్లలనే ఉదాహరణగా చూపుతున్నారు సదరు ఉపాధ్యాయులు. తద్వారా అందరిలో స్ఫూర్తి నింపుతూ ప్రభుత్వ పాఠశాల కీర్తిని చాటుతున్నారు. బహుశా ఇలాంటి ఉపాధ్యాయులు ఈ కాలంలో ఉన్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. రాజేంద్రప్రసాద్ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్నారనే విమర్శలు విస్తృతంగా ఉండేవి. ఈ నేపథ్యంలో, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించిన ఉపాధ్యాయులను అభినందించడం ద్వారా, లోకేష్ ప్రభుత్వం ప్రభుత్వ విద్య పట్ల తన నిబద్ధతను చాటుకున్నట్లు అయ్యింది.

Teacher Role Models

ప్రైవేట్‌కు ధీటుగా..
కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆశయాన్ని క్లియర్ కట్‌గా చూడొచ్చు. ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం, ప్రజల్లో ప్రభుత్వ విద్య పట్ల నమ్మకాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే.. విద్యావ్యవస్థలో సంస్కరణలు చేపడతామని, ఉపాధ్యాయుల బోధన భారాన్ని తగ్గిస్తామని, అనవసరపు యాప్‌ల వినియోగాన్ని తగ్గిస్తామని లోకేష్ గతంలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఉపాధ్యాయుల బదిలీల్లో రాజకీయ జోక్యాన్ని కూడా నిరోధించాలని కూడా సూచించారు. డీఎస్సీ (ఉపాధ్యాయుల నియామకం) ప్రక్రియను త్వరగా ప్రారంభించే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఇవన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచడానికి, ఉపాధ్యాయుల నైతిక స్థైర్యాన్ని పెంచడానికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇవన్నీ ఒకెత్తయితే.. ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తుంటే ఇది కదా తాను కోరుకున్న మార్పు అనిపిస్తోందని కూడా లోకేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి, ప్రవేశాలకు పోటీ ఏర్పడే పరిస్థితి రావాలని యువ మంత్రి ఆశిస్తున్నారు. ఈ ట్వీట్ ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తూ, ప్రజల్లో ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకాన్ని కలిగించే దిశగా లోకేష్ తీసుకున్న చర్యగా చూడవచ్చు.

Read Also- Viral News: పాములా మెలికలు తిరిగిన బ్రిడ్జ్.. సెకన్లలోనే సచ్చిపోతారంతే!

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?