Nara Lokesh: ఏపీ అసెంబ్లీ(AP Assembly)లో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మంత్రి లోకేశ్(Minister Lokesh) తన సహాచరుడు నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu)కు ప్రేమతో కూడిన హెచ్చరికలు జారీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిమ్మల సభకు హాజరయ్యారు. దీని గమనించిన లోకేశ్ ‘‘ఆరోగ్యం బాగా లేకపోయిన అసెంబ్లీకి వస్తున్నారు ఎందుకు? చెప్తున్నా వినరు కదా. చెప్పినట్టు వింటారా లేక సభ నుంచి సస్పెండ్ చేయమంటారా’’ అని సరదా వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ వ్యాఖ్యలకు నవ్వుతూ సమాధానమిచ్చిన నిమ్మల… నిన్నటి కంటే ఆరోగ్యం మెరుగుపడిందని, అందుకే వచ్చానని చెప్పారు. దీంతో లోకేశ్.. ‘‘చెప్తున్నా వినడం లేదు.. మీరైనా రూలింగ్ ఇవ్వండి అధ్యక్షా’’ అని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు(Deputy Speaker Raghu Rama Krishanam Raju)ను కోరారు. దానికి రఘురామ స్పందిస్తూ… రామానాయుడు పని రాక్షసుడన్నారు. ప్రజాసేవే కాదు ఆరోగ్యం కూడా చూసుకోండని హితవు పలికారు. జ్వరం తగ్గే వరకు అసెంబ్లీకి రావద్దు … ఇది నా రూలింగ్(Ruling) అంటూ ఆర్డర్ వేశారు. దీనికి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మద్దతు పలికారు. ఈ సరదా సంభాషణ అసెంబ్లీ లాబీలో జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, వారం రోజులుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ. 3.22 లక్షల కోట్లతో రాబోయే ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ ను రూపొందించారు. ఆసక్తికరంగా తొలి రోజు అసెంబ్లీకి ప్రతిపక్ష నేత జగన్ హాజరవడం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి అనంతరం అసెంబ్లీకి రాని ఆయన ఈ సారి శాసనసభలో అడుగుపెట్టారు. కానీ అతి తక్కువ సమయం మాత్రమే గడిపారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే … ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో స్పీకర్ వారిని సస్పెండ్ చేశారు. ఇక, ప్రతిపక్ష హోదా విషయంలో అసెంబ్లీ దద్దరిల్లింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రతిపక్ష హోదా రాదని తెలిసినా కావాలనే జగన్ విష ప్రచారం చేస్తున్నారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారని స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శించారు. ఇక, బడ్జెట్ మోసపూరితంగా ఉందని, బాబు ష్యూరిటి మోసం గ్యారంటీ అన్న చందంగా ఉందని విలేకర్ల సమావేశంలో జగన్ విమర్శించారు. ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా బడ్జెట్ ప్రసంగం సాగిందని ఆరోపించారు.
Also Read:
Borugadda:ఫేక్ సర్టిఫికెట్ తో బెయిల్… బోరుగడ్డ కోసం పోలీసుల సెర్చ్