Satish death Case:
అనంతపురం: టీటీడీ (TTD) మాజీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్ మృతి కేసు (Satish death Case) మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే, ఈ కేసులో దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. దర్యాప్తులో భాగంగా, సతీష్ కుమార్ (Satish Kumar) కదలికలను రికార్డు చేసిన సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. సతీష్ కుమార్ ట్రైన్ ఎక్కడానికి ముందు ఓ టీ స్టాల్‌లో టీ తాగినట్టు గుర్తించారు. ఆ సీసీ ఫుటేజ్‌లో పోలీసులు పరిశీలించగా, సతీష్ కుమార్ మొహంలో ఎలాంటి ఆందోళన లేదని పోలీసుల భావిస్తున్నారు. దీంతో, ట్రైన్‌లో ఏం జరిగి ఉంటుంది? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రైన్‌లో ఏ1, ఏ2, ఏ3 బోగీల్లో ప్రయాణించిన ప్యాసింజర్ల లిస్టును పోలీసులు సేకరించారు. ఆ ప్రయాణికుల్లో ఎవరైనా నేర చరిత్ర ఉన్నవారు ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. నిజానికి సతీష్ కుమార్ ఏ1 బోగీలోని సీటు నంబర్ 21 బుక్ చేసుకున్నారు. కానీ, ఆయన లగేజ్ మాత్రం సీట్ నెంబర్ 11లో లభ్యమైంది. దీంతో, ఆ దిశగా పోలీసులు ఎంక్వైరీ జరుపుతున్నారు. లగేజ్ ఆ సీట్లో ఎందుకు ఉంది? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. మరోవైపు, సతీష్ ఫోన్ కాల్ లిస్ట్‌ను కూడా పోలీసులు బయటకు తీస్తున్నారు.
సతీష్ మృతి దుర్మార్గం: ఆళ్లపాటి రాజా
మాజీ టీటీడీ ఏవీఎస్‌వో సతీష్ కుమార్ మృతి చాలా దుర్మార్గమని తెనాలి ఎమ్మెల్సీ ఆళ్లపాటి రాజా (Allapati Raja) ఖండించారు. వైసీపీ (YSRCP) వాళ్లు మాత్రమే ఇదొక ఆత్మహత్యగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. సతీష్ కుమార్, రవికుమార్ మధ్య ఎలా రాజీ కుదిర్చారు?, టీటీడీ డబ్బులు పోతే… కాంపౌండబుల్ అఫెన్స్‌గా ఎలా మార్చివేసి, రాజీ చేశారు? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నాయకులు నెయ్యిని కల్తీ చేసి, శ్రీవారి ఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేశారని ఆళ్లపాటి రాజా మండిపడ్డారు. కల్తీ వ్యవహారం మరచిపోకముందే పరకామణి వ్యవహారం బయటకు వచ్చిందని సందేహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణాన్ని ఒడిగట్టేందుకైనా వెనుకాడబోదని ఆళ్లపాటి రాజా ఆరోపించారు. అసలు కర్త, కర్మ, క్రియ ఎవరనే విషయం బయటకు తెచ్చేందుకే సీఐడీ విచారణకు హైకోర్టు ఆదేశించిందని ప్రస్తావించారు. ఇది ఆరంభం మాత్రమేనని, వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొకటిగా బయటకు వస్తున్నాయని ఆయన అన్నారు.
Read also- Crime News: భార్య తలపై రోకలిబండతో కొట్టి చంపిన భర్త.. కారణం ఏమిటో తెలుసా?
కాగా, టీటీడీ మాజీ అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్‌వో) అయిన వై.సతీష్ కుమార్, హత్యకు గురవ్వడానికి ముందు గుంతకల్లు రైల్వే సీఐగా విధులు నిర్వహించారు. టీటీడీ పరకామణి చోరీ కేసులో ఆయన ఫిర్యాదుదారుడిగా ఉన్నారు. 2023లో పరకామణిలో డాలర్లు దొంగిలిస్తున్న రవికుమార్ అనే సిబ్బందిని పట్టుకుని కేసు పెట్టారు. తర్వాత కేసుపై లోక్ అదాలత్‌లో రాజీ కుదిరింది. అయితే, హైకోర్టు ఆదేశాల మేరకు పరకామణి కేసులో సీఐడీ విచారణ జరుగుతున్న తరుణంలో, విచారణకు హాజరయ్యేందుకు గుంతకల్లు నుంచి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి బయలుదేరిన సతీష్ కుమార్, నవంబర్ 14న (2025) అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని విగతజీవిగా కనిపించారు. కోమలి వద్ద రైలు పట్టాల పక్కన ఆయన డెడ్‌బాడీని గుర్తించారు.
Read Also- Harish Rao: రైతుల ఆత్మహత్యలకు బాధ్యులెవరు..? ప్రభుత్వం పై హరీష్ రావు ఫైర్
ఇది హత్యే అని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరకామణి కేసులో నిందితులే హత్య చేసి ఉండవచ్చని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.
