Murali Naik: దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియల సేపథ్యంలో మంత్రి నారా లోకేష్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి, నివాళులు అర్పించారు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మంత్రి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి సైనికుడు కావాలని కలలు కన్న మురళీ నాయక్ బార్డర్ లో శత్రుదేశం పాకిస్థాన్‌తో పోరాడుతూ వీరమరణం పొందటం చాలా బాధాకరమని అన్నారు. తాను చనిపోతే జాతీయ జెండా కప్పుకునే పోతానని చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని బాధపడ్డారు.
Also read: Viral Video: దరిద్రం అంటే మీదే బ్రో.. ఉత్తి పుణ్యానికి రూ.కోటి బిల్లు కట్టారు?
చిన్న వయస్సులోనే మురళీ నాయక్ చనిపోవడం బాధాకరమంటూ అంటూ మంత్రి లోకేష్ భావోద్వేగానికి లోనయ్యారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం తరుపున 5 ఎకరాల భూమి, 300 గజాల స్థలం, 50 లక్షల ఆర్థిక సాయంతో పాటు మురళీ తండ్రికి ఉద్యోగం ఇస్తామన్నారు. జిల్లా హెడ్‌క్వార్టర్స్ లో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వీర మరణం పొందిన మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. భారత్ దాడిని తట్టుకోలేక పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చి.. తిరిగి కొన్ని గంటలకే వక్రబుద్ధి చూపించిదన్నారు. మురళీ నాయక్ కుటుంబానికి వ్యక్తిగతంగా రూ. 25 లక్షలు ఇస్తానని మాటిచ్చారు.
వీర జవాన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్ దేశానికి చేసిన సేవలను తలుచుకుంటూ అతని తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది.