Kondapalli Srinivas: టెక్నాలజీ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పుడు ఏం కావాలన్నా సరే నిమిషాల్లోనో ఆన్‌లైన్‌లో చకచకా జరిగిపోతున్నాయి. ఫుడ్ ఆర్డర్లు మొదలుకుని ఫిర్యాదుల వరకూ ఏమున్నా సరే టెక్నాలజీతోనే నడిచిపోతోంది. ముఖ్యంగా ఈ మధ్య సోషల్ మీడియా అనేది ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఒక మంచి వేదిక అయ్యింది. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అలా పోస్టు పెట్టి సదరు మంత్రి లేదా అధికారికి ట్యాగ్ చేస్తే చాలు.. నిమిషాల వ్యవధిలోనే టీమ్ స్పందిస్తున్నది. కాస్త సమయం అడిగి ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పెద్దలు కొందరు సోషల్ మీడియా టీమ్‌ను ఏర్పాటు చేసుకొని, ఎవరేం ట్యాగ్ చేసినా సరే నిమిషాల్లో స్పందించేలా క్లియర్ కట్‌గా ఆదేశాలు ఇచ్చేశారు. దీంతో అటు స్పందన.. ఇటు సమస్యకు పరిష్కారం వీలైనంత వరకూ దొరుకుతోంది.
అటు ఫిర్యాదు.. ఇటు క్షమాపణ
ఏపీలో ఇంటికో ఎంట్రప్రెన్యూర్‌ను తయారుచేయాలని సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యువతను ప్రోత్సహిస్తూ.. కంపెనీలు, స్టార్టప్‌లు పెట్టడానికి కూడా వారికి తగిన సహాయం చేస్తున్నారు. అయితే సంబంధిత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాత్రం అంతగా యాక్టివ్‌గా కనిపించట్లేదు. ఎందుకంటే ఏదైనా కంపెనీ ప్రారంభించాలంటే ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖల మంత్రిగా ఉన్నారు గనుక అనుమతి తప్పనిసరి. జానకీరాజు అనే వ్యక్తి చిన్నతరహా పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇందుకు సంబంధించిన పేపర్ వర్క్ కోసం 20 రోజులుగా తిరుగుతున్నా సంబంధిత ప్రభుత్వ శాఖ తరఫున ఎలాంటి స్పందన రాలేదు. తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేశామని కాకినాడకు చెందిన వ్యక్తి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో పాటు ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్‌ను ట్యాగ్ చేశాడు. దీంతో వెంటనే స్పందించిన లోకేష్ టీమ్.. సంబంధిత మంత్రి కొండపల్లిని అలర్ట్ చేసింది. ఆ సామాన్యుడి ట్వీట్‌కు.. ‘ మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు అడుగుతున్నాను. దయచేసి మిమ్మల్ని సంప్రదించేందుకు పూర్తి వివరాలను నాకు పంపండి’ అని మంత్రి శ్రీనివాస్ రిప్లయ్ ఇచ్చారు.
Read Also-YS Jagan: వైఎస్ జగన్ మళ్లీ పాదయాత్ర.. అవసరమేనా?
మంత్రి అయినా సారీ..!
ప్రస్తుతం ఎక్స్ వేదికగా అటు సామాన్యుడి ట్వీట్.. ఇటు మంత్రి క్షమాపణ చెబుతున్న పోస్టు వైరల్ అవుతున్నాయి. రాష్ట్రానికి మంత్రి అయినా సరే.. సామాన్యుడికి క్షమాపణలు చెప్పడంపై సోషల్ మీడియాలో కొంపల్లిని మెచ్చుకుంటున్నారు. సమస్య గురించి చెప్పగానే స్పందించిన తీరు బావుందని.. అంతే తొందరగా ఆ సామాన్యుడికి పరిష్కారం లభిస్తే ఇంకా మంచిదని సూచిస్తున్నారు. కాగా, మంత్రి శ్రీనివాస్‌పై ఇప్పటికే ఒకట్రెండు సార్లు సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని, పనితీరు మెరుగుపర్చుకోవాలని క్లాస్ తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపైన మంత్రితో పాటు సంబంధిత శాఖ, అధికారులను అలర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు.. ఎంఎస్ఎంఈ, సెర్ప్ శాఖలను పరుగులు పెట్టించి, ఇప్పటి వరకూ శాఖపై ఉన్న చెడ్డపేరును తొలగించాల్సిన బాధ్యత మంత్రిపైన ఉన్నది.
Read Also- AP Politics: ఏపీలో ‘హెలీకాప్టర్’ ఫైట్.. కొంపదీసి ఇదంతా సంపద సృష్టేనా?
Apologies for the inconvenience. Kindly send me your contact details via DM. https://t.co/l8qK9XVVI0
— Kondapalli Srinivas (@SKondapalliOffl) May 15, 2025