MLA Satyanarayana (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

MLA Satyanarayana: నిధులు ఇవ్వట్లేదు.. సిగ్గు పడుతున్నా.. టీడీపీ ఎమ్మెల్యే అసహనం!

MLA Satyanarayana: ఏపీలోని కూటమి ప్రభుత్వానికి నిరసన సెగ తగిలింది. మాడుగల నియోజక వర్గ టీడీపీ ఎమ్మెల్యే ప్రభుత్వానికి, మంత్రులకు చురకలు అంటించారు. తన నియోజక వర్గ అభివృద్ధిలో వెనకబడిపోయిందని వ్యాఖ్యానించారు. ఆదుకోమని మంత్రులను ప్రార్థించినా ఫలితం లేకుండా పోతోందని కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

ఎందుకింత వివక్ష
పాయకరావుపేట మినీ మహానాడులో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana Murthy) పాల్గొన్నారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీ, రెసిడెన్షియల్ స్కూల్,స్టేడియం, ఎలాంటి పరిశ్రమలు లేని నియోజకవర్గంగా మాడుగల మారిపోయిందని అన్నారు. మాడుగుల నియోజకవర్గంపై ఎందుకు వివక్ష జరుగుతుందో చెప్పుకోవలసిన బాధ్యత మహానాడు వేదికగా తనకు ఉందని అన్నారు.

నిధుల మంజూరులో చిన్నచూపు
వెనకబడిన మాడుగుల నియోజకవర్గాన్ని ఆదుకోమని మంత్రులను అర్ధించి వేడుకున్నానని బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. ఎలాంటి అభివృద్ధికి నోచుకోని మాడుగుల, చోడవరం నియోజకవర్గాలపై ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. రైవాడ డ్యాం డెవలప్ చేయమని ఇరిగేషన్ మంత్రికి, ఆర్థిక మంత్రికి, జిల్లా మంత్రులకు చెప్పిన ఇప్పటివరకు పట్టించుకోలేదని ఎమ్మెల్యే అన్నారు. నిధుల మంజూరు విషయంలోనూ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి రూ. 7 కోట్లు, రూ.6 కోట్లు ఇస్తూ తమ నియోజకవర్గానికి రూ.3 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని సత్యనారాయణ ఆరోపించారు.

ముఖం మీద చెప్తే.. నచ్చజెప్పుకుంటా!
మాడుగల నియోజకవర్గానికి రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం లేదా అంటూ బండారు సత్యనారాయణ నిలదీశారు. ప్రజలే తమని కూడా ఎన్నుకున్నారని మాకు కూడా సమానంగా నిధులు ఇవ్వాలని మంత్రులను సూటిగా కోరారు. నిధులు రాక ఎవ్వరికీ చెప్పుకోలేక.. మహానాడు వేదికగా చెప్పుకుంటున్నామని అన్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఎలాగో చెప్పలేనని.. దయచేసి అర్థం చేసుకుని నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని సత్యనారాయణ కోరారు. ఒకవేళ మాడుగలకు నిధులు ఏమి ఇవ్వమని ముఖం మీద చెప్పిస్తే.. నియోజక వర్గ ప్రజల వద్దకు వెళ్లి తానే నచ్చజెప్పుకుంటానని అన్నారు.

Also Read: YS Jagan: లిక్కర్ స్కామ్‌పై కుండబద్దలు కొట్టిన జగన్.. విజయసాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు!

పదవిలో ఉండి ఎందుకు!
పొరపాటున నాకు ఓట్లు వేసి గెలిపించారని మాడగల ప్రజలకు తెలియజేస్తామని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ అన్నారు. ‘పెద్దవాళ్లకే నిధులు ఇస్తారంట.. నేను చిన్న వాడిని నాకు నిధులు ఇవ్వరంట’ అని ప్రజలతో చెప్పి క్షమాపణ కొరతానని అన్నారు. వివక్షతో ఎవరినీ చూడవద్దని.. అది మన పార్టీకి అస్సలు మంచిది కాదని బండారు సత్యనారాయణ హితవు పలికారు. ప్రజలు, నియోజకవర్గానికి న్యాయం చేయలేకపోతే పదవిలో ఉండటం ఎందుకని ప్రశ్నించారు.

Also Read This: TDP vs Janasena: కూటమిలో మళ్లీ విభేదాలు.. జనసేన నేతపై నోరుపారేసుకున్న టీడీపీ నాయకుడు!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు