Kurnool Bus Tragedy: కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన బైకర్ శివశంకర్(Shiva Shankar) పై అతని స్నేహితుడు ఎర్రిస్వామి(Erriswamy) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శివశంకర్ నిర్లక్ష్యం వల్లనే బైక్ డివైడర్‌ను ఢీ కొట్టినట్లు ఫిర్యాదులో ఎర్రిస్వామి పేర్కోన్నాడు. శివశంకర్ మద్యం సేవించి బండినడిపినట్లు అతడి స్నేహితుడు పేర్కొన్నాడు. మద్యం మత్తుల్లో స్పీడుగా డ్రైవింగ్ చేయడం వలన బైక్(Bike) అదుపుతప్పిందని పేర్కోన్నాడు. రాష్ డ్రైవింగ్ చేయడం వల్ల బండి కంట్రోల్ కాక అదుపు తప్పి కింద ఉన్న డివైడర్ ఢీ కోట్టిందని, దాంతో అక్కడిక్కడే శివశంకర్ మృతి చెందాడని తెలిపాడు. తీవ్రగాయలతో నేను అక్కడినుండి బయట పడ్డానని ఎర్రి స్వామి తెలిపాడు. అనంతరం అతడి శిశంకర్ ని పక్కకు తీసేందుకు ప్రయత్నించానని ఎర్రిస్వామి పేర్కొన్నాడు. కింద పడిన తరువాత తమ బైకు రోడ్డు మద్యలోనే ఉండిపోయిందని, రోడ్డుపై వస్తున్న మరో వాహనం డీకొట్టడంతో బైక్ అక్కడే ఉండిపోయిందని తెలిపాడు. బస్సు కిదకి వెల్లని బైక్ రోడ్డుపై కోంతదూరు వరకు వెల్లగానే మంటలు వచ్చాయని ఫిర్యాదు దారుడు ఎర్రి స్వామి పేర్కొన్నాడు.
Also Read: Kurnool Bus Fire Accident: బస్సు ప్రమాద మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియో.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
శుక్రవారం తెల్లవారుజామున
కర్నూలు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కావేరి ట్రావెల్స్‌కు చెందిన వోల్వో ప్రైవేటు బస్సులో మంటలు ఎర్పడ్డాయి. ఈ బస్సు హైదరాబాద్(Hyderabad) నుంచి బెంగళూరు(Bangalore) వెళ్తున్నది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో ఓ బైకును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి విస్తరించడంతో భారీగా అగ్నికీలలు చెలరేగాయి. దీంతో చూస్తుండగానే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. బస్సులో ఉన్నవారంతా నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో పలువురు బస్సులోనే సజీవదహనం అయ్యారు. ప్రమాదం సమయంలో బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నారు.
