Chandrababu Kuppam
ఆంధ్రప్రదేశ్

Chandrababu: కుప్పం ప్రజలకు సీబీఎన్ అదిరిపోయే శుభవార్త.. ఎగిరి గంతేస్తున్న జనం!

Chandrababu: అవును.. తన సొంత ఇలాకా, కుప్పం నియోజకవర్గం ప్రజలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు అదిరిపోయే శుభవార్తలు చెప్పారు. దీంతో ఆ నియోజకవర్గం ప్రజలు ఎగిరి గంతేస్తున్నారు. వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. రెండు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా బుధవారం నాడు చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.1292.74 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాల ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే కుప్పంలో రూ.1271.65 కోట్ల పెట్టుబడులు పెట్టే వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం, తుంసీ ఏపీ మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కుప్పం ప్రజలతోనూ, అలాగే వివిధ పథకాల లబ్దిదారులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా కుప్పం అభివృద్ధి ప్రణాళికలను వివరించడంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చెప్పారు. ఇదే సందర్భంలో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ రాజకీయాలను నేరమయం చేసే కొన్ని పార్టీల కుట్రలను సీఎం వివరించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని వికాసం వైపు అడుగులు వేయిస్తూ.. సంక్షేమం అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తూ.. ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా పని చేస్తున్నానని చంద్రబాబు చెప్పారు.

చివరి ఎకరానికీ నీళ్లు
కుప్పం అభివృద్ధికి బ్రహ్మాండమైన ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. నియోజకవర్గాన్ని సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం వెల్లడించారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చా. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తాం. రూ.3,890 కోట్ల వ్యయం చేసి హంద్రినీవా పనులు పూర్తి చేస్తున్నాం. కుప్పంలో ఇప్పటికే హంద్రీ-నీవా కాల్వల లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కుప్పం నియోజకవర్గంలో రూ.42.07 కోట్లతో 30.14 కిలో మీటర్ల మేర హెచ్ఎన్ఎస్ఎస్ కాల్వ పనులు పూర్తయ్యాయి. కుప్పంలో చివరి ఆయకట్టు వరకూ నీళ్లు తీసుకువస్తాం. ఈ ఏడాదిలోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా నీళ్లు పారిస్తాం. అభివృద్ధి చేసే వారికి మాత్రమే సంక్షేమం గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పు చేసి సంక్షేమం చేస్తామనటం ఏం పరిపాలన..? అప్పు తెచ్చి అభివృద్ధి చేసి వచ్చిన ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు చేయటమే నిజమైన ఆర్ధిక వ్యవస్థ. గత ఏడాదిగా రాష్ట్రంలో ఈ విధానాన్నే అవలంబిస్తున్నాం. ప్రజలంతా ఆశీర్వదించబట్టే ఏడాదిగా సుపరిపాలనను రాష్ట్రంలో అందిస్తున్నాం. కుప్పంలో రూ.1292 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల్ని చేస్తున్నాం. ఇప్పటికే రూ.125 కోట్ల విలువైన పనులు కూడా పూర్తి అయ్యాయి. రాష్ట్రంలో గుంతలు లేని రహదారులే లక్ష్యంగా పనిచేసాం. గతంలో మహిళలు కట్టెల పొయ్యిపై వంట చేయకూడదని దీపం పథకం అమలు చేశాం. నాడు దీపంతో గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం.. నేడు దీపం-2.0తో ఉచిత సిలెండర్లు ఇస్తున్నాం. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా రహదారులను సీసీ, బీటీ రోడ్లుగా మారుస్తున్నాం. కుప్పం నియోజకవర్గంలో ప్రతీ ఇంటిలోనూ వంటగ్యాస్ ఉంది అని చంద్రబాబు వెల్లడించారు.

Read Also- Nara Lokesh: నారా లోకేష్‌పై కుట్ర జరుగుతోందా.. ఇలా ఉన్నారేంట్రా?

బ్రాండ్ కుప్పం..
గతంలో బ్రాండ్ కుప్పం అనేది లేదు. ఇప్పుడు బ్రాండ్ కుప్పం పేరుతో ప్రమోట్ చేస్తాం. ఈ బ్రాండును మార్కెట్టులో ఎస్టాబ్లిష్ చేస్తాం. కుప్పంలో తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తాం. కుప్పంలో ఎయిర్ పోర్టు రాబోతోంది. రూ.850 కోట్లను కుప్పం విమానాశ్రయానికి ఖర్చు చేయబోతున్నాం. విమానాశ్రయానికి భూములివ్వొద్దని కొందరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎయిర్ పోర్టుకు భూమి ఇచ్చిన వారికి మెరుగైన ప్యాకేజీ ఇస్తాం. అమరావతి రాజధానికి భూములిచ్చారు.. రాజధాని రైతులకూ ప్యాకేజీ ఇచ్చాం. కుప్పంలో ప్రతి ఇంటిపైనా సోలార్ ప్యానెల్ ఉండాలి. ప్రతి ఒక్కరూ సోలార్ ప్యానెల్ పెట్టుకునేంత వరకు నేను మీ వెంట పడతాను. ఇళ్లపై రూఫ్ టాప్ ఏర్పాటు ద్వారా మనమే సొంతగా విద్యుత్ తయారు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే పీఎం సూర్యఘర్ పధకం కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తున్నాం. బీసీలకు రాయితీ కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేస్తాం. సూర్యఘర్ పథకాన్ని పూర్తిగా వినియుగించుకుంటే కరెంటు కోతల పరిస్థితి ఉండదు.. కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. కుప్పంలో ఏసీల అవసరం ఉండదు కానీ.. అవసరమైతే ఏసీలకు సోలార్ విద్యుత్ పెట్టుకోవచ్చు. ఇళ్లకే కాదు వ్యవసాయానికి సోలార్ విద్యుత్ వినియోగించుకోవాలి. వ్యవసాయ మోటార్లకు సోలార్ ప్యానెళ్లు బిగించుకోవచ్చు.. కేంద్ర ప్రభుత్వ పథకం కింద మోటార్లకు సోలార్ ప్యానెళ్లు బిగిస్తాం. కుప్పం రైల్వే స్టేషన్ ఆధునీకరిస్తాం, చెన్నైకి, బెంగళూరుకు వెళ్లే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. పలమనేరు నుంచి కృష్ణగిరి రహదారికి 4 లేన్ల రహదారి వేస్తున్నాం. కుప్పం నుంచి హోసూర్ వరకూ మరో సమాంతర రహదారి నిర్మిస్తాం. కృష్ణగిరి, బెంగళూరు, కోలార్, చెన్నైల మధ్య కుప్పం కేంద్రంగా మారుతుంది. బ్రహ్మాండమైన అభివృద్ధి కుప్పంలో జరగబోతోంది. కుప్పం రూపురేఖలు మార్చేందుకు ఓ అద్భుతమైన ప్రణాళిక తయారు చేశాం అని చంద్రబాబు వివరించారు.

సైకిల్ ఈజ్ ది బెస్ట్
కుప్పంలో 400 మంది డ్వాక్రా మహిళలకు ఇ-సైకిళ్లను అందిస్తున్నాం. ఎక్కువ శ్రమ లేకుండా సైకిల్ తొక్కవచ్చు.. వ్యాయామం కోసం కూడా సైకిల్ తొక్కాలి. అందుకే సైకిల్ ఈజ్ ది బెస్ట్, సైకిల్ తొక్కితే ఆరోగ్యం, ఆనందం, సైకిలే శాశ్వతం. గత ప్రభుత్వ హయాంలో ల్యాండ్ రికార్డులన్నీ అస్తవ్యస్తం చేశారు. 22ఏ భూముల్ని ఇష్టానుసారంగా అమ్మేశారు. రాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా, ఆక్రమణలు లేకుండా కాపాడే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంది. గతంలో క్వార్టర్ బాటిల్ తాగి నానా యాగీ చేశారు. అఘాయిత్యాలు చేశారు. రౌడీయిజం చేస్తే ఆటలు సాగనివ్వను. ప్రస్తుతం ఉన్నది సీబీఎన్-2014 కాదు.. సీబీఎన్-1995. 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నాపై ఎప్పుడైనా నేరారోపణలు ఉన్నాయా..? ఇప్పుడు కొందరు రాజకీయాలను నేరమయం చేస్తున్నారు. బాబాయిని చంపి.. నాపై నేరం మోపారు. కారు కింద వారి కార్యకర్తల్నే తొక్కించి.. కుక్కపిల్లలా రోడ్డు పక్కన పడేశారు. ఇప్పుడు వారి కార్యకర్త మరణానికి కారణం ప్రభుత్వమేనంటున్నారు. కోడికత్తి, గులకరాయి లాంటి డ్రామాలాడి నాపైనే నెపం పెట్టారు. హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేయను.. నాకు తెలిసింది ప్రజాహిత రాజకీయాలు మాత్రమే. రాక్షసులపై యుద్ధం చేస్తున్నా.. అభివృద్ధి, సంక్షేమ కోసం యజ్ఞం చేస్తున్నా.. యజ్ఞ ఫలితాలను ప్రజలకు అందిస్తాను. తప్పు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. కులాలు మతాలు కాదు కావాల్సింది అభివృద్దే. తద్వారా నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నదే నా ఆకాంక్ష. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి.. అందుకే నెల రోజుల పాటు సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పార్టీ అధ్యక్షుడిగా పార్టీలో కార్యకర్తలను, సీఎంగా కలెక్టర్ నుంచి క్షేత్రస్థాయిలో ఉద్యోగి వరకూ అందరినీ సమన్వయంతో పనిచేయించి పొలిటికల్ గవర్నెన్సు చేస్తున్నాం. పీ4 ద్వారా పేదలను ఆదుకునేలా బంగారు కుటుంబాలను- మార్గదర్శుల ద్వారా కార్యక్రమం అమలు చేస్తున్నాం అని చంద్రబాబు చెప్పారు.

Read Also- Infosys: టాయిలెట్‌కు వెళ్లిన యువతి.. నిమిషాల్లోనే అరుపులు.. ఫోన్ చెక్ చేయగా?

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?