nagababu
ఆంధ్రప్రదేశ్

Nagababu: నాగబాబు నామినేషన్… బలపరిచిన లోకేశ్

Nagababu: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ(MLA Quota MLC Elections) అభ్యర్థిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సోదరుడు కొణిదెల నాగబాబు (Konidela Nagababu) నామినేషన్(Nomination) దాఖలు చేశారు. ఇవాళ(శుక్రవారం) ఏపీ(AP) అసెంబ్లీ(Assembly)లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి(Returning Officer) వనితారాణికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) బలపరిచారు. నాగబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), అనకాపల్లి ఎమ్మెల్యే రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు(CM Chanadrababu Naidu) నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు, నామినేషన్‌ను బలపరిచిన లోకేశ్, మనోహర్‌కు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు.

ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును ఆ పార్టీ అధ్యక్షుడు,డిప్యూటీ సీఎం పవన్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అనంతరం నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. గురువారం ఆ పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. కాగా, ముందు నాగబాబును క్యాబినెట్ లోకి తీసుకుంటారని, కార్పోరేషన్ పదవి కట్టబెడతారని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరికి ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ సీటను ఖరారు చేయడంతో వాటికి తెర పడినట్లు అయింది.

ఇదిలావుంటే, చిరంజీవి కుటుంబం నుంచి చట్టసభలోకి అడుగుపెట్టబోతున్న మూడో వ్యక్తి నాగబాబు కాబోతున్నారు. అంతకుముందే ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి.. శాసనసభ్యునిగా ఉన్నారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం నామినేటెడ్ పోస్టు కింద రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. అనంతరం.. చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ సోదరుడు పవన్ కళ్యాణ్ ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించారు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన ఆయన ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని పదేళ్ల తర్వాత ఏకంగా పోటీ చేసిన అన్ని సీట్లలో నెగ్గి 100 శాతం స్ట్రయిక్ రేట్ తో చరిత్ర సృష్టించి ఉప ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పడు అదే కుటుంబంలో నుంచి మరో వ్యక్తి నాగబాబు పెద్దల సభలో అడుగుపెట్టబోతున్నారు. ఏది ఏమైనా.. ఈ సందర్భం కొణిదెల కుటుంబానికి సంబంధించి ఇదొక మైలురాయి లాంటిదననే జనసైనికులు, మెగా అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Also Read:

Nara Lokesh: మాట వింటారా… సస్పెండ్ చేయమంటారా? సహచర మంత్రితో నారా లోకేశ్

 

 

 

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు