Nagababu: మతిస్థిమితం కోల్పోయిన తన భర్త తప్పిపోవడంతో ఓ మహిళ తల్లడిల్లుతోంది. అతడి ఆచూకీ దొరకక గత 10 నెలలుగా తీవ్ర ఆవేదన చెందుతోంది. ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ వేడుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురానికి (Pithapuram) చెందిన ఆ బాధిత ఆవేదన జనసేన (Jana Sena) ప్రధాన కార్యదర్శ నాగబాబు (Nagababu) దృష్టికి వెళ్లింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన పంచుకున్నారు. తన భర్త బోడెం గోపాలకృష్ణ గత 10 నెలలుగా కనిపించకపోవడంతో బోడెం అనునాగ శ్రీశాంతి అనే మహిళ వెతుకులాడుతోంది. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో, పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతున్న ‘‘పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలకు’’ హాజరైన జనసేన ఎమ్మెల్సీ నాగబాబును కలిసి తన బాధను వెల్లడించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన తెలిపారు.
బోడెం గోపాలకృష్ణ మిస్సింగ్
మిస్సింగ్ అయిన వ్యక్తి బోడెం గోపాలకృష్ణ (Boddem Gopalakrishna missing) వివరాలను నాగబాబు వెల్లడించారు. బోడెం అనునాగ శ్రీశాంతి అనే మహిళ ఇద్దరు చిన్నారులతో తనను కలవాలనే ప్రయత్నం చేసిందని, దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించిందని, జనంలో కిక్కిరిసి పోతున్న ఆ మహిళను పిలిచి మాట్లాడగా భర్త కనిపించడం లేదంటూ చెప్పిందన్నారు. భర్త బోడెం గోపాల కృష్ణ గత 10 నెలలుగా ఆచూకీ తెలియకుండా పోయారంటూ ఆవేదనతో ఆ మహిళ చెప్పిన మాటలు కలిచివేశాయని నాగబాబు అన్నారు. అక్కడ ఉన్న పోలీస్ అధికారుల సహాయంతో ఆ మహిళను పిలిపించి మరోమారు మాట్లాడగా.. తన భర్త మతిస్థిమితం లేని కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అక్కడి నుంచి తప్పిపోయారని చెప్పారన్నారు.
ఆచూకీ తెలుసుకోండి
బాధిత మహిళ సమస్య ఆలపించిన నాగబాబు.. తక్షణమే అక్కడున్న పోలీస్ అధికారులతో మాట్లాడారు. తప్పిపోయిన వ్యక్తి వివరాలు సేకరించి, అతడి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. తప్పిపోయిన బోడెం గోపాల కృష్ణ ఫొటోను కూడా ఈ సందర్భంగా నాగబాబు తన పోస్టుకు జోడించారు. అందరి ప్రయత్నం ఫలించి తన భర్త ఆచూకీ తెలిస్తే మానసిక ఆందోళనకు గురవుతున్న ఆ మహిళకు ఓదార్పు లభిస్తుందని నాగబాబు అన్నారు. ఒక కుటుంబం నిలబడుతుందని వ్యాఖ్యానించారు. ‘‘మీలో ఎవరికైనా ఈ వ్యక్తి ఆచూకీ తెలిస్తే ఇక్కడ ఉన్న నంబర్లకు తెలియపరచచగలరని కోరుతున్నాను’’ అని నాగబాబు కోరారు. 8367328112, 7661811577, 9848358378 ఫోన్ నంబర్లను ఆయన షేర్ చేశారు.
Read Also- US Airstrikes: సిరియాలో ఐసిస్ ఉగ్రసంస్థపై అమెరికా మెరుపుదాడులు

