Tdp counter attack
ఆంధ్రప్రదేశ్

Tdp counter: జగన్‌కు టీడీపీ కౌంటర్… కిడ్నాప్ వీడియో విడుదల

జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ పార్టీ నేతలు
అబద్ధాల జగన్ అంటూ లోకేష్ ఫైర్
కిడ్నాప్ వీడియో (kidnap video) విడుదల చేసిన కొల్లు రవీంద్ర

మంగళగిరి, స్వేచ్ఛ:  జైలులో వంశీని (Vallabhaneni Vamsi) కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్ (Ys Jagan) మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్‌పై (Nar Lokesh) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు, టీడీపీ (Tdp) ఆఫీస్ తగులబడింది లేదని అన్నారు. తప్పుడు కేసులతో వంశీని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టీడీపీ స్పందించింది. ‘ఎక్స్‌’లో (X) జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి వీడియోలు, ఫోటోలు కనిపిస్తున్నాయి. మంటల్లో కారు తగులబడటం, ఫర్నీచర్ ధ్వంస మవటం అన్నీ ఉన్నాయి. అయినా కూడా జగన్ దాడి జరగలేదని అనడంపై టీడీపీ మండిపడింది.

‘‘జగన్‌కు అబద్ధాలు చెప్పే అలవాటు ఇంకా పోనట్టు ఉంది. టీడీపీ కార్యాలయం మీద దాడి జరగనే లేదని అంటున్నారు. అలాంటప్పుడు కోర్టులో కేసు పెట్టిన దళిత యువకుడు సత్యవర్ధన్‌ను నీ పిల్ల సైకో ఎందుకు కిడ్నాప్ చేసాడో అడగలేదా జగన్?’’ అంటూ ప్రశ్నించింది.

స్పందించిన మంత్రి లోకేష్

జగన్ వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ స్పందించారు. ‘‘నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్‌గా చెప్పడంలో మీరు పీహెచ్ డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూశారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్. అధికారం ఉన్నప్పుడు యథేచ్ఛగా చట్టాలను తుంగలో తొక్కి ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది’’ అంటూ చురకలంటించారు.

కిడ్నాప్ వీడియో విడుదల

దళిత యువకుడు సత్యవర్థన్‌ కిడ్నాప్‌ ఎలా జరిగిందో వివరిస్తూ మంత్రి కొల్లు రవీంద్ర సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని మై హోమ్ భుజాలో నమోదైన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను విడుదల చేశారు. ఈ అపార్ట్‌మెంట్‌లోనే వంశీ నివసిస్తున్నారు. ఫుటేజ్ విడుదల సందర్భంగా మాట్లాడిన రవీంద్ర, పులివెందుల ఫ్యాక్షనిజాన్ని రాష్ట్రమంతా చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. ప్రశాతమైన కృష్ణా జిల్లాలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సత్యవర్థన్‌ను ఎలా కిడ్నాప్ చేశారో సీసీటీవీ ఫుటేజ్ సాక్ష్యమని అన్నారు.

ఇవీ చదవండి 

Ys Jagan | వంశీపై తప్పుడు కేసులు పెట్టారు.. మాజీ సీఎం జగన్ ఆరోపణ..!

 

 

 

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు