YS Jagan (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

YS Jagan: జగన్ నోట.. ధోని మాట.. నేతల్లో కసి రగిల్చిన వైసీపీ అధినేత!

YS Jagan: ఏపీలో యథేచ్ఛగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) ఆరోపించారు. ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతోందని.. వాటన్నింటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశమైన జగన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని.. ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని మండిపడ్డారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోందని పేర్కొన్నారు.

జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం
తొలుత జిల్లా అధ్యక్షులను ఉద్దేశించి మాట్లాడిన జగన్.. ఎవరి జిల్లాల్లో పార్టీ ఓనర్ షిప్ వారిదేనని స్ఫష్టం చేశారు. అందుకే ప్రజా సంబంధిత అంశాల్లో చొరవ చూపాలని కోరారు. ఎవరి ఆదేశాల కోసం ఎదురు చూడొద్దని.. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలని సూచించారు. మే నెలాఖరులోపు పార్టీ మండల కమిటీలు ఏర్పాటు కావాలన్న జగన్.. జూన్, జూలైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీల్లో డివిజన్‌ కమిటీలు పూర్తి చేయాలని అన్నారు. అలాగే ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్‌ కమిటీలన్నీ ఏర్పాటు కావాలని.. ఇదే లక్ష్యంతో జిల్లా అధ్యక్షులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ధోనిలా తయారు కావాలి
భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్ మెన్ ప్రతిభ బయట పడుతుందన్న జగన్.. ప్రతిపక్షంలో మనం చేసే పనుల వల్ల మనం ఎలివేట్‌ అవుతామని అన్నారు. అందరూ ధోనీల్లా తయారు కావాలని.. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతామని పేర్కొన్నారు. జిల్లాల్లో ఏం జరిగినా జిల్లా అధ్యక్షులు ప్రజల తరఫున నిలబడాలని చురుగ్గా కార్యక్రమాలు చేయాలని సూచించారు. ప్రజా వ్యతిరేక అంశాల మీద గట్టిగా పోరాడాలని.. లేదంటే పార్టీపరంగా అవకాశాలను కోల్పోయినట్టేనని చెప్పారు.

Also Read: Thalliki Vandanam Scheme: తల్లికి వందనం స్కీమ్ లో కొత్త మెలిక? ఆ తప్పు చేస్తే డబ్బు రానట్లే!

ఏడాదిలోపే వ్యతిరేకత
మామూలుగా రెండు, మూడేళ్ళైతే కానీ ప్రభుత్వ వ్యతిరేకత బయటకు కనిపించదన్న జగన్.. కాని ఏపీలో ఏడాదిలోపే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయిందని అన్నారు. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తి చేసి అందరం కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాలను బలంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది అందుబాటులోకి వస్తారని జగన్ పేర్కొన్నారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 1500 మంది ఉంటారని అన్నారు.

రైతుల పక్షాన పోరాటం
వివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్న జగన్… అందుకే మనం రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలని, వారి డిమాండ్ల సాధనకు పోరాడాలని, పార్టీ జిల్లా అధ్యక్షులకు జగన్‌ దిశానిర్దేశం చేశారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ