ITDP Kiran Arrested (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

ITDP Kiran Arrested: చేబ్రోల్ కిరణ్ కు బిగ్ షాక్.. ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ఆపై అరెస్టు!

ITDP Kiran Arrested: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. వైఎస్ భారతీ (YS Bharathi)ని ఉద్దేశిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉండటంతో కూటమి ప్రభుత్వం అతడిపై చర్యలకు ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చేబ్రోల్ కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఒక్కసారిగా బయటకు రావడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా
టీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అటు వైసీపీ వర్గాలు దీనిపై ఘాటుగా స్పందిస్తున్నాయి. సోషల్ మీడియాలో  ఈ విషయం మరింత ముదురుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. చేబ్రోల్ కిరణ్ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. అతడు విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి గుంటూరు పోలీసులు వెళ్లి.. బలవంతంగా కిరణ్ ను అరెస్టు చేశారు. బలవంతంగా జీబులోకి ఎక్కించారు.

Also Read: Wines Close in Hyderabad: మందుబాబులకు బిగ్ షాక్.. ఈ వీకెండ్ లోనూ మందు లేనట్లే!

‘తన మన భేదం లేదు’
సోషల్ మీడియాలో ఎవరు అసభ్య కామెంట్స్ పెట్టిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం తొలి నుంచి చెబుతూ వస్తోంది. మహిళలు, చిన్నారులపై తప్పుడు కామెంట్స్ చేసేవారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిస్తోంది. సోషల్ మీడియాలో గాడి తప్పిన వ్యక్తులను నియంత్రించేందుకు ప్రభుత్వం గత 9 నెలల్లో అనేక చర్యలు తీసుకుంది. ఈ క్రమంలోనే సొంతపార్టీ నేత తప్పుచేసినా.. ఈ విషయంలో వెనక్కితగ్గేది లేదని చేబ్రోల్ కిరణ్ అంశంలో స్పష్టం చేసింది.

సారి చెప్పిన కిరణ్
వైఎస్ భారతీపై చేసిన కామెంట్స్ పై సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తుండటంతో చేబ్రోల్ కిరణ్ ఆందోళనలోకి నెట్టింది. దీంతో సారీ చెబుతూ కిరణ్ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశాడు. తాను ఇక రాజకీయ విమర్శలు చేయనని, వైఎస్ జగన్ తో పాటు వారి కుటుంబ సభ్యులకు సారీ చెబుతున్నానని, తనను క్షమించాలని కిరణ్ కోరాడు. తాను ఆవేశంతో చేసిన కామెంట్స్ గా పరిగణించాలని, ఇక తనను వదిలి వేయాలని విన్నవించాడు.

Also Read This: Malla Reddy Joins TDP: బీఆర్ఎస్ కు భారీ షాక్.. టీడీపీలోకి మల్లారెడ్డి? బుల్లెట్ ట్రైన్ సాక్షిగా రివీల్!

వైసీపీ వార్నింగ్
ఇది ఇలా ఉంటే వైసీపీ మాత్రం కిరణ్ చేసిన కామెంట్స్ పై ఇంకా గుర్రుగానే ఉందని చెప్పవచ్చు. కిరణ్.. నిన్ను వదిలేది అంటూ కొందరు వైసీపీకి చెందిన అభిమానులు సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని అప్పుడు నీ పని చెబుతామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఏది ఏమైనా కిరణ్ కామెంట్స్ టీడీపీ నేతలకే నచ్చలేదని, ఇలాంటి కామెంట్స్ కు అందరూ దూరంగా ఉండాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?