Jogi Ramesh arrest: వైసీపీ మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత జోగి రమేష్‌ను ఆదివారం తెల్లవారుజామున ఎక్సైజ్ విభాగం అధికారులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం తయారీ కేసుతో సంబంధం కలిగి ఉన్నట్లుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఉదయం అయిదు గంటల నుంచి రమేశ్ ఇంటి ముందు హైడ్రామా నెలకొంది. దాదాపు మూడు గంటల తర్వాత ఆయన తలుపులు తీయడంతో నోటీసులు అందించి అరెస్టు చేశారు. అనంతరం ఆయన్ని విజయవాడలో ఉన్న సిట్ కార్యాలయానికి తరలించారు. కేసుకు సంబంధించి ఏ1 గా ఉన్న అద్దేపల్లి జనార్ధన్ ఈ నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ సోదరులు పాత్ర ఉందని తెలపడంతో ఆయన్ని అరెస్టు చేశారు. ఆయనతో పాటు రమేశ్ అనుచరుడు అయిన రామును కూడా అరెస్టు చేశారు. దీంతో పాటు కాల్ డేటా, కీలక పత్రాలు, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు సేకరించాలి. అయితే ఈ రోజు ఆదివారం కావడంతో అప్పటి వరకూ ఆయన్ని పోలీసుల కస్టడీలో ఉంచనున్నారు. ఈ కేసులో జోగి రమేశ్ ను ఏ18 గా చేర్చనున్నారు.
ఈ కేసు అక్టోబర్ 2025లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలో పలు చోట్ల నకిలీ మద్యం తయారీ యూనిట్లను పోలీసులు బహిర్గతం చేశారు. ఈ నకిలీ మద్యం వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయారని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) అయిన అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, “జోగి రమేష్ ప్రోద్భవంతోనే నకిలీ మద్యం తయారు చేశాను” అని పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్ అవుతూ, జోగి రమేష్‌తో ఆయనకు సన్నిహిత సంబంధాలు (ఫోటోలు, చాట్‌లు) కూడా బయటపడ్డాయి. దీంతో జోగి రమేశ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Read also-Srinivas Goud: ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
