Nara Lokesh
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Nara Lokesh: విద్య విలువ తెలిసిన మంత్రి నారా లోకేష్!

Nara Lokesh: విద్య విలువ తెలిసిన విద్యా మంత్రి నారా లోకేష్.. ఒక య‌జ్ఞంగా చేప‌ట్టిన సంస్కర‌ణ‌లు స‌త్ఫలితాలను ఇస్తున్నాయని టీడీపీ చెప్పుకుంటోంది. అంతేకాదు.. విద్యాల‌యాలు విద్యార్థుల స‌మ‌గ్రవికాసానికి దోహ‌ద‌ప‌డేలా తీర్చిదిద్దారని ధీమాగా తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. రుచి, శుభ్రత‌, పోష‌క విలువ‌లున్న భోజ‌నం చేస్తున్న విద్యార్థులు మ‌ధ్యాహ్నం బ‌డిలోనే భోజనం చేస్తున్న పరిస్థితులను ఈ కూటమి సర్కారులోనే చూస్తున్నామని చెప్పారు. అంతేకాదు.. కార్పొరేట్ విద్యా సంస్థల్ని త‌ల‌ద‌న్నేలా ఉన్న యూనిఫాం, బూట్లు, బెల్టు, బ్యాగు, పుస్తకాల‌తో ప్రభుత్వ విద్యార్థుల ఆత్మవిశ్వాసంతో చ‌దువుల్లో పోటీప‌డ‌తామని అంటున్నట్లుగా లోకేష్ చెప్పుకుంటున్నారు. అయితే.. విద్యార్థుల‌ శారీర‌క‌-మానసిక ఆరోగ్యానికి ఆట‌పాట‌లు, ఎన్సీసీ స్కూళ్లలో అందుబాటులోకి తెచ్చినట్లు కూడా లోకేష్ వెల్లడించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. గత 5 ఏళ్ళ వైసీపీ పాలనలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థని లోకేష్ దారిలో పెడుతున్నారని టీడీపీ చెప్పుకుంటోంది.

Read Also- YSRCP: ఇంటింటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోసాలు!

దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా..
యావత్ భారతదేశంలోనే విద్యా సంస్థలకు ఆంధ్రప్రదేశ్ వేదిక అవుతున్నది. ఎందుకంటే.. రాజధాని అమరావతిలో, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌ (బిట్స్) ఏర్పాటు చేస్తున్నట్టు కుమార మంగళం బిర్లా ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2 వేల కోట్ల పెట్టుబడితో డిజిటల్ ఫస్ట్ ఆపరేషన్స్‌తో, ఏఐ, ఐఓటి ఇంటిగ్రేట్ చేసి క్యాంపస్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. 7వేల మంది విద్యార్ధులు చదువుకునే విధంగా క్యాంపస్ నిర్మిస్తున్నారు. మరోవైపు.. బిట్స్ క్యాంపస్ కోసం అమరావతిలో 35 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో, వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు కానుంది. బిట్స్ అధికారులు.. సీఆర్డీఏ అధికారులతో కలిసి ఈ భూములను ఇదివరకే పరిశీలించారు. ఈ క్యాంపస్ పరిశోధన, వ్యవస్థాపకతకు ఒక కేంద్రంగా కూడా పని చేయనుంది. ఇది భారతదేశ ప్రతిభను ఆధునిక సాంకేతికతలలో నాయకత్వం వహించడానికి సిద్ధం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు అమరావతిని ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా బిట్స్, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, నేషనల్ లా యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు స్థలాలను కేటాయించారు.

Read Also- Kota Srinivasa Rao: లెజండరీ నటుడు కోట శ్రీనివాసరావు గురించి మీకేం తెలుసు.. ఇంట్రెస్టింగ్ విషయాలివే!

త‌ల్లీ నీకు వంద‌నం..
ఎక్స్ వేదికగా నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఓ మహిళ తల్లికి వందనం డబ్బులు తిరిగిచ్చేస్తూ ఉదారత చాటుకున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమెపై లోకేష్ ప్రశంసలు కురిపించారు.‘ పిల్లల చ‌దువుకు త‌ల్లిదండ్రుల్లా ఆలోచిస్తూ కూట‌మి ప్రభుత్వమే అన్నీ స‌మకూరుస్తోంది. త‌ల్లికి వంద‌నం ప‌థ‌కం కింద‌ త‌న ఖాతాలో ప‌డిన 13 వేలుకి మ‌రో రెండు వేలు క‌లిపి 15 వేలు పాఠ‌శాల అభివృద్ధికి వినియోగించాల‌ని అందించిన త‌ల్లీ నీకు వంద‌నం. శ్రీకాకుళం జిల్లా గార మండ‌లం క‌ళింగ‌ప‌ట్నం-మ‌త్స్యలేశం ప్రభుత్వ పాఠ‌శాల‌లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న కుమారుడికి వ‌చ్చిన త‌ల్లికి వంద‌నం నిధులు అదే పాఠ‌శాల అభివృద్ధికి అందించిన త‌ల్లికి అభినంద‌న‌లు. విద్యా వ్యవ‌స్థ బ‌లోపేతానికి మేము చేస్తున్న కృషికి మీలాంటి వారి స‌హ‌కారం తోడు కావ‌డం చాలా సంతోషం’ అని లోకేష్ అభినందించారు.

Read Also-Warangal News : సొంత గ్రామంలోనే కాంగ్రెస్ నేతను తిరస్కరించిన కార్యకర్తలు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?