Annadatha Sukhibhava (Image source Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Annadata Sukhibhava: ఏపీలో 46.86 లక్షల మంది రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపే డబ్బులు జమ

Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 46.86 లక్షల మంది రైతులు హర్షించే సమయం ఆసన్నమైంది. ఒక్కొక్కరి ఖాతాలో ఏడు వేల రూపాయలు జమ చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది. రైతులకు పెట్టుబడి సాయానికి ఉద్దేశించిన కేంద్ర ప్రభుత్వ ‘పీఎం కిసాన్‌’, రాష్ట్ర ప్రభుత్వ ‘అన్నదాతా సుఖీభవ’ పథకాల డబ్బులు రైతుల ఖాతాల్లో జమవ్వనున్నాయి. ఈ మేరకు వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురంలో జరిగే ‘అన్నదాతా సుఖీభవ’ అమలు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నిధులు రిలీజ్ చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 వేలు మొత్తం కలిపి రూ.7 వేలు చొప్పున అకౌంట్లలో పడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే కార్యక్రమాలలో పలువురు కేంద్ర, కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. కాగా, అర్హత కలిగిన రైతులు తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ.ఏపీ.గవ్.ఇన్ (annadathasukhibhava.ap.gov.in) పోర్టల్ ఓపెన్ చేసి, అవసరమైన వివరాలను ఎంటర్ చేసి స్టేటస్‌ను చెక్ చేసుకోవచ్చు.

Read Also- Akhanda 2 second single: బాలయ్య బాబు ‘అఖండా 2’ నుంచి మరో సింగిల్.. స్టెప్పులు మామూలుగా లేవుగా..

కాగా, పీఎం-కిసాన్ (PM-KISAN) అంటే, ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన’. ఈ పథకాన్ని కేంద్రప్రభుత్వం అందిస్తోంది. ఇక, అన్నదాతా సుఖీభవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న రైతులు పెట్టుబడి అదనపు సాయం పథకం. ఈ రెండు పథకాల ద్వారా రైతులకు ప్రతిఏటా ఏటా మొత్తం రూ.20,000 ఆర్థిక సహాయం అందించాలన్నది కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం వాటాగా పీఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం రూ.6,000 జమ అవుతుంది. మూడు విడతల్లో రూ.2,000 చొప్పున రైతుల ఖాతాలో పడుతుంది. ఇక, రాష్ట్ర ప్రభుత్వం వాటాగా అన్నదాతా సుఖీభవ కింద ప్రతి ఏటా రూ.14,000 ఖాతాలో పడతాయి. మొత్తం మూడు విడతల్లో కలిపి ఒక్కో రైతుకు రూ.20 వేల ఆర్థిక సాయం అందనుంది. రైతులకు ఆర్థిక భద్రత కల్పించడం, పంట పెట్టుబడికి అదనపు సాయం అందించడం ప్రభుత్వ లక్ష్యాలుగా ఉన్నాయి.

Read Also- Viral Video: వామ్మో ఇదేం వింత.. కారు మిర్రర్ నుంచి బయటకొచ్చిన పాము.. వీడియో వైరల్

Just In

01

Ginning Millers Strike: పత్తిరైతులకు గుడ్‌న్యూస్.. జిన్నింగ్ మిల్లర్లతో మంత్రి తమ్మల చర్చలు సఫలం

Andhra King Taluka Trailer: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ట్రైలర్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి..

Shamsabad tragedy: గర్భవతి మృతి.. జీర్ణించుకోలేక భర్త ఆత్మహత్య.. తీవ్ర విషాద ఘటన

BJP Flex Dispute: బీజేపీలో ముదిరిన ‘పవర్ వార్’.. ఈటల అడ్డాలో బండి సంజయ్ వర్గం ఏం చేస్తోందంటే?

SI Bribery Case: గోడ దూకి పరారైన ఎస్ఐ, వెంబడించి పట్టుకున్న ఏసీబీ.. ఇంతకీ ఏం చేశాడంటే?